రామ్ దేవ్ బాబా.. కండోమ్స్ కూడా..!

ఒకవైపు ప్రభుత్వంపై మండిపడటంతో పాటు.. మరోవైపు రామ్ దేవ్ బాబాపై గట్టి సెటైరే వేసింది రాఖీ సావంత్. ప్రైమ్ టైమ్ లో కండోమ్ యాడ్స్ ను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార శాఖ నిషేధం…

ఒకవైపు ప్రభుత్వంపై మండిపడటంతో పాటు.. మరోవైపు రామ్ దేవ్ బాబాపై గట్టి సెటైరే వేసింది రాఖీ సావంత్. ప్రైమ్ టైమ్ లో కండోమ్ యాడ్స్ ను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార శాఖ నిషేధం విధించడాన్ని రాఖీ తీవ్రంగా తప్పుపట్టింది. ఒక కండోమ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రాఖీ.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది.

దేశంలో ప్రజలకు ఎయిడ్స్ తో పాటు సుఖవ్యాధులు ప్రబలేలా చేయడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోంటోందని రాఖీ వ్యాఖ్యానించింది. దేశంలో ఎయిడ్స్ ను వ్యాప్తి చెందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాఖీ విరుచుకుపడింది. రాఖీ సావంత్ ఈ కామెంట్ చేసింది కాబట్టి చాలా మందికి సిల్లీగా అనిపించవచ్చు కానీ, కండోమ్స్ పై వీలైనంత అవగాహన పెంపొందించడం ప్రభుత్వం విధి.

ఒక దశలో.. ప్రతి వైన్ షాప్ వద్దా.. ఉచితంగా కండోమ్ ప్యాకెట్లు పెట్టిన దేశం మనది. సినీతారలు.. రాహుల్ ద్రావిడ్ వంటి వారి చేత కూడా కండోమ్ లను ప్రమోట్ చేయించిన చరిత్ర ఉంది భారత ప్రభుత్వానికి. మైదానంలోకి దిగేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని.. రాహుల్ ద్రావిడ్ ఒక కండోమ్ యాడ్ లో కనిపించాడు. కేంద్ర సమాచార శాఖే ఆ యాడ్ తీయించింది. బహుశా వాజ్ పేయి హయాంలో. ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి కండోమ్ యాడ్ తప్పనిపిస్తోంది.

ఈ విషయంలో కోర్టులు చీవాట్లు పెడుతున్నాయి. ఈ నేఫథ్యంలో రాఖీ కూడా తన వంతుగా హాటుగా ఘాటుగా చీవాట్లు పెట్టింది. అంతటితో ఆగితే రాఖీ ఎందుకవుతుంది. అందుకే ఈమె మరిన్ని ఉచిత సలహాలు ఇచ్చింది. ఇప్పటికే లెక్కలేనన్ని ప్రోడక్టుల ఉత్పత్తితో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించేస్తున్న బాబా రాందేవ్ కండోమ్స్ కూడా ఉత్పత్తి చేయాలని రాఖీ పిలుపునిచ్చింది.

రాందేవ్ కండోమ్ లు వాడుకలోకి రావాలని ఈమె ఆకాంక్షించింది. అలాగే విరాట్, అనుష్కాలను కూడా రాఖీ గిల్లింది. తను ప్రమోట్ చేస్తున్న కండోమ్ నే విరాట్ వాడాలని.. పచ్చిగా పిలుపునిచ్చింది రాఖీ. తను ప్రమోట్ చేస్తున్న కండోమ్స్ చాలా గొప్ప ఫీలింగ్ ను ఇస్తాయని.. వాడి చూసి ఆ అనుభూతిని తనకు వివరించాలని రాఖీ కోరింది.