సైరా షెడ్యూల్ పూర్తి.. వాట్ నెక్ట్స్?

చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ లోనే సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. కత్తియుద్ధం, మల్లయుద్ధం లాంటి సన్నివేశాలు తీశారు. Advertisement హాలీవుడ్ యాక్షన్…

చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ లోనే సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. కత్తియుద్ధం, మల్లయుద్ధం లాంటి సన్నివేశాలు తీశారు.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోనీ చింగ్ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ స్టంట్స్.. చాలా స్టయిలిష్ గా, చాలా బాగా వచ్చాయంటున్నాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న సైరాకు రామ్ చరణ్ నిర్మాత.

సైరా సినిమాకు సంబంధించి నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ బయటకురాలేదు. రాజస్థాన్ లో ఈ మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయాన్ని వాయిదావేశారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఆమె కాల్షీట్లు చూసి నెక్ట్స్ షెడ్యూల్ ఫిక్స్ చేయాలని యూనిట్ భావిస్తోంది.