ఈ క్రిస్మస్ ను కమల్ కూడా మిస్ అయ్యాడు. ఈరోజు విశ్వరూపం-2టీజర్ విడుదల చేయాలనుకున్నాడు కమల్ హాసన్. కానీ అది సాధ్యం కాలేదు. అమెరికాలో జరుగుతున్న ఈ సినిమా రీ-రికార్డింగ్ పనులు ఇంకా కొలిక్కిరాలేదు. టీజర్ కూడా రెడీ కాలేదు.
తన పుట్టినరోజు సందర్భంగా విశ్వరూపం-2టీజర్ విడుదల చేయాలని కమల్ భావించాడు. కానీ అప్పుడు రాజకీయ పార్టీ ప్రకటన, తమిళనాట వివాదాల కారణంగా అది సాధ్యంకాలేదు. సో.. క్రిస్మస్ కు టీజర్ వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఆడియో మిక్సింగ్ లో జాప్యం వల్ల ఈరోజు కూడా విడుదల కావట్లేదు విశ్వరూపం-2టీజర్.
ఇక సినిమా విడుదలలో కూడా అదే జాప్యం కనిపిస్తోంది. లెక్కప్రకారం జనవరి 26న విశ్వరూపం-2సినిమా విడుదలకావాలి. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.