వెంకటేశ్, రానా కలిసి సినిమా చేస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పట్నుంచో వెయిటింగ్. మంచి స్టోరీ దొరికితే కలిసి పని చేయడానికి ఈ హీరోలు కూడా సిద్ధమే. కానీ అలాంటి ఓ మంచి కథ దొరకడం లేదంటున్నాడు నిర్మాత సురేష్ బాబు. అయితే ఇప్పుడా టైం రానే వచ్చింది. రానా, వెంకీ కలిసి నటిస్తున్నారు. కాకపోతే అది సినిమాలో కాదు. ఓ వెబ్ సిరీస్ లో.
రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన కాన్సెప్ట్ తో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇందులో నటించేందుకు రానా ఇప్పటికే ఒప్పుకున్నాడు. తాజాగా ఈ సిరీస్ లో నటించేందుకు వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంకీ, రానా కలిసి దాదాపు 3ఎపిసోడ్స్ లో కనిపించబోతున్నారు. వెంకటేష్ కు ఇదే మొట్టమొదటి వెబ్ సిరీస్.
గతంలో వీళ్లిద్దరూ కలిసి కృష్ణంవందేజగద్గురుం అనే సినిమాలో కనిపించారు. అందులో సమీరారెడ్డి చేసిన ఓ ఐటెంసాంగ్ లో ఇలా వచ్చి అలా మెరుస్తాడు వెంకటేశ్. కానీ మల్టీస్టారర్ మూవీ మాత్రం వర్కవుట్ కాలేదు. సురేష్ బాబు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. కథలు నచ్చక పక్కనపెట్టారు.
మళ్లీ ఇన్నాళ్లకు వెంకీ, రానా కలిసి ఇలా వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం తేజ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న వెంకీ… ఈ మూవీతో పాటు వెబ్ సిరీస్ లో నటించనున్నాడు.