మల్టీస్టారర్ లు చేయడం ద్వారా కాస్త కెరీర్ ను నెట్టుకురావచ్చనది సీనియర్ హీరో వెంకటేష్ ఆలోచన. సోలో ఆచితూచి సినిమాలు చేస్తుంటే బాగానే వుంది కానీ సరైన సబ్జెక్ట్ లు దొరకడం లేదు. అతికష్టం మీద దృశ్యం, గురు సినిమాలు దొరికాయి. దృశ్యం బాగానే వసూళ్లు సాగించింది కానీ, గురు ఆ రేంజ్ కు చేరలేదు. అందుకే సదా మల్టీస్టారర్ ల కేసి చూస్తుంటాడు వెంకీ.
అయితే అక్కడ ఇంకో సమస్య వుంది. వెంకీ క్యారెక్టర్ ది పైచేయి కావాలి. మిగిలిన క్యారెక్టర్ కాస్త తగ్గాలి. ఇది చాలా స్మూత్ గా జరిగిపోయే ఆపరేషన్. అందుకే ఎవరూ ముందుకు రావడం లేదు వెంకీతో చేయడానికి అని గుసగుసలు వున్నాయి. మసాలా సినిమా రామ్ తో చేస్తే, ఫ్లాపయి కూర్చుంది. ఆ సినిమా చేసిన తరువాత తన క్యారెక్టర్ ను చాలా మార్చేసి, తగ్గించేసి చేసారని ఫీలయ్యాడని వార్తలు వినిపించాయి.
పవన్ తో గోపాల గోపాల చేసారు. ఇక్కడ క్యారెక్టర్ సమస్య రాలేదు కానీ, సహ నిర్మాత శరద్ మరార్ తో లెక్కల విషయంలో తేడా వచ్చిందని, పవన్ జోక్యం చేసుకుంటే తప్ప, సరైన సెటిల్ మెంట్ జరగలేదని వార్తలు వినిపించాయి.
ఆ తరువాత వెంకీతో మల్టీస్టారర్ విషయమై చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి కానీ ఏవీ మెటీరియలైజ్ కాలేదు. ఇంట్లో యంగ్ హీరో రానాను వుంచుకుని బయట హీరోల కోసం వెదుకుతుంటారు ఎందుకో అన్నది తెలియదు. లేటెస్ట్ గా అనిల్ రావిపూడి చేసే మల్టీ స్టారర్ కు వెంకీ ఫిక్సయ్యాడు. కానీ యంగ్ హీరో కావాలి. దిల్ రాజు తన మొహమాటంతో వరుణ్ తేజను ఒప్పించినట్లు తెలుస్తోంది.
మరి ఈ సారి ఎలా వుంటుందో? ఏం గుసగుసలు వినిపిస్తాయో చూడాలి.