మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు

తెరవెనక్కు పోయింది, కామప్ అయిపోయింది అనుకున్న డ్రగ్స్ కేసు మళ్లీ పడగవిప్పేలా కనిపిస్తోంది. సినిమా  సెలబ్రిటీలు చాలామంది ఇన్ వాల్వ్ అయిన డ్రగ్స్ కేసు విషయంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందట. రావడం విశేషం కాదు.…

తెరవెనక్కు పోయింది, కామప్ అయిపోయింది అనుకున్న డ్రగ్స్ కేసు మళ్లీ పడగవిప్పేలా కనిపిస్తోంది. సినిమా  సెలబ్రిటీలు చాలామంది ఇన్ వాల్వ్ అయిన డ్రగ్స్ కేసు విషయంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందట. రావడం విశేషం కాదు. ఆ నివేదికలో ఒక సినిమా సెలబ్రిటీ రక్తంలో మాదకద్రవ్యాల వాడకం నమూనాలు వున్నట్లు తేలిందని తెలిసిందట.

సినిమా సెలబ్రిటీలను కొంతమందికి నోటీసులు పంపి, రప్పించి, రక్తపరీక్ష నమూనాలు సేకరించిన సంగతి తెలిసిందే. మరి ఆ సెలబ్రిటీ ఎవరన్నది బయటకు తెలియదు. ఎందుకంటే అధికారులు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్డుకు అందిస్తారు కనుక. ఆ విషయం అప్పుడే బయటకురాదు.

వాస్తవానికి 12మంది విచారణకు హాజరైతే ఆరుగురినే బ్లడ్ శాంపిల్స్ అడిగారు. వారిలో ముగ్గురు నిరాకరించారు. ముగ్గురు ఇచ్చారు. ఆ ముగ్గురిలో ఈ ఒక్కరు ఎవరు అన్నది తెలియాల్సి వుంది.

పద్ధతి ప్రకారం ఫోరెన్సిక్ నివేదికను కోర్టులో సబ్ మిట్ చేసారని తెలుస్తోంది. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోర్టుకు దరఖాస్తు చేసి ఆ నివేదికను తీసుకోవాలి. ఆపైన దాని ఆధారంగా సిట్ తదుపరి చర్యలు వుంటాయి. కావాలంటే ఆ వ్యక్తిని అరెస్టు కూడా చేసే అధికారం కూడా వుంటుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.

మొత్తంమీద ముగిసిందనుకున్న డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టించేలాగే వుంది చూస్తుంటే.