పాతిక సినిమాల పవన్.. అంతేనా?

పవన్-ఏఎం రత్నం మూవీ పవన్-మైత్రీ మూవీస్ సినిమా పవన్-దిల్ రాజు సినిమా Advertisement ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. ఇంతకీ పవన్ వీటిలో ఏ సినిమా చేస్తాడు.. అసలు సినిమాలు…

పవన్-ఏఎం రత్నం మూవీ
పవన్-మైత్రీ మూవీస్ సినిమా
పవన్-దిల్ రాజు సినిమా

ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. ఇంతకీ పవన్ వీటిలో ఏ సినిమా చేస్తాడు.. అసలు సినిమాలు చేస్తాడా చేయడా.. అదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

అజ్ఞాతవాసి ఆడియో రిలీజై, విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో.. పవన్ నెక్ట్స్ ప్రాజెక్టు ఏంటనే చర్చ ఊపందుకుంది. ఇందులో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందనేదే న్యూస్ ఎప్పట్నుంచో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు పవన్ అడ్వాన్స్ కూడా అందుకున్నాడట.

ఈ సినిమా కంటే ముందు పవన్ కొబ్బరికాయ కొట్టిన మూవీ ఒకటుంది. అదే నేసన్ దర్శకత్వంలో ఏఎం రత్నం ప్రజెంటర్ గా సినిమా. ఈ మూవీ ఆగిపోయిందంటూ ఆ మధ్య ప్రచారం జరిగినప్పటికీ, లేదు త్వరలోనే స్టార్ట్ అవుతుందంటూ స్వయంగా ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ప్రకటించాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా ఎంపికైన తమన్ కూడా అప్పుడప్పుడు ఇదే చెబుతున్నాడు.

ఈ రెండిండితో పాటు దిల్ రాజు కూడా లిస్ట్ లోకి చేరాడు. పవన్ ను ఎప్పుడు కలిసినా స్టోరీ ఎప్పుడు చెబుతావ్ అంటూ అడుగుతున్నారని.. ఈసారి మంచి స్టోరీతో పవన్ ను కలుస్తానని ఈమధ్య ప్రకటించాడు దిల్ రాజు.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని కథనాలు నడుస్తున్నప్పటికీ.. పవన్ మాత్రం గ్యాప్ తీసుకుంటాడనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే తను ఏ సినిమా కంప్లీట్ చేసినా ఆ తర్వాత గ్యాప్ తీసుకోవడం ఈ హీరో స్టయిల్. దీనికి తోడు ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంటరయ్యాడు కాబట్టి.. పవన్ 26వ సినిమాపై ప్రకటన ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదంటున్నారు అతడి సన్నిహితులు.