ముందే కూస్తున్న ఒక్క క్షణం

ఒక్కక్షణం. అల్లు శిరీష్ కి మాంచి ఆశలు కల్పిస్తున్న సినిమా. ఈ సినిమా హిట్ అయితే శిరీష్ ను హీరోగా నిల్చో పెట్టచ్చు అన్నది తండ్రి అరవింద్ ఐడియా. కొత్తజంట (మారుతి), శ్రీరస్తు శుభమస్తు…

ఒక్కక్షణం. అల్లు శిరీష్ కి మాంచి ఆశలు కల్పిస్తున్న సినిమా. ఈ సినిమా హిట్ అయితే శిరీష్ ను హీరోగా నిల్చో పెట్టచ్చు అన్నది తండ్రి అరవింద్ ఐడియా. కొత్తజంట (మారుతి), శ్రీరస్తు శుభమస్తు (పరుశురామ్) సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అధ్భుతాలు చేయకపోయినా, కాస్తో, కూస్తో లాభాలే తెచ్చాయి. అయితే ఒక్కక్షణం వ్యవవహారం వేరు. ఇది అల్లు శిరీష్ బయటి బ్యానర్ లో చేస్తున్న సినిమా. 

అందువల్ల ఈ సినిమా హిట్ అయితే, ఇక బయట బ్యానర్లలో ఆఫర్లు వస్తాయి. అందుకే ఒక్కక్షణం సినిమాకు వీలయినంత బజ్ రప్పించడానికి తెగ కష్టపడుతున్నారు. అయితే చిత్రంగా ఈ కష్టం దాదాపు మూడు వారాల ముందే మొదలెట్టేయడం విచిత్రం.

సినిమాకు సంబంధించి ప్రచారాలు, ఇంటర్వూలు ఇలా ఇప్పటి నుంచే కానిచ్చేస్తున్నారు. కానీ ఒక్కక్షణం ముందు రెండు పెద్ద సినిమాలు వున్నాయి. ఇప్పుడు చేసిన పబ్లిసిటీ అంతా ఆ పెద్ద సినిమాలు వచ్చేసరికి జనం మరిచిపోయే ప్రమాదం వుంది. ఆ వారం అంతా ఆ సినిమా హడావుడే వుంటుంది.

అప్పుడు ఒక్కక్షణం చేయడానికీ ఏమీ మిగలదు. చేసేదీ వుండదు. అయితే లక్కీగా ఒక్కక్షణం మీద గట్టి పోటీ ఏమీ లేదు. కేవలం కమెడియన్ కమ్ హీరో సునీల్ నటించిన టూ కంట్రీస్ సినిమా తప్పించి.

అసలే సునీల్ సినిమాలకు ఓపేనింగ్స్ కరువైపోయాయి. పైగా టూ కంట్రీస్ పేరు జనాలకు ఏ మేరకు రీచ్ అవుతుందో తెలియదు. అందువల్ల శిరీష్ సినిమా ఆ విధంగా సేఫ్. కానీ ఇప్పుడు చేస్తున్న పబ్లిసిటీ హడావుడి, కాస్త విడుదలకు ముందుగా చేస్తే బెటరేమో?