అసలైన తొలిప్రేమ మాదే

పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ తొలిప్రేమ. ఇప్పుడీ మూవీని ప్రమోషన్ కోసం వాడుకునేందుకు ఇద్దరు మెగా హీరోలు తెగ తంటాలు పడుతున్నారు. పవన్ తర్వాత తొలిప్రేమ అనే టైటిల్ వాడుకున్నది వరుణ్…

పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ తొలిప్రేమ. ఇప్పుడీ మూవీని ప్రమోషన్ కోసం వాడుకునేందుకు ఇద్దరు మెగా హీరోలు తెగ తంటాలు పడుతున్నారు. పవన్ తర్వాత తొలిప్రేమ అనే టైటిల్ వాడుకున్నది వరుణ్ తేజ్. ఆ టైటిల్ ను  తాజాగా ప్రకటించాడు కూడా. కానీ ఇప్పుడు సీన్ లోకి సాయిధరమ్ తేజ్ ఎంటరయ్యాడు.

అప్పట్లో పవన్ తో తొలిప్రేమ సినిమా తీసిన కరుణాకరన్ తో ఓ మూవీ చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు కానీ అసలైన తొలి ప్రేమ తమదే అంటున్నాడు తేజ్. పవన్ నటించిన తొలిప్రేమకు, ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తను చేస్తున్న సినిమాకు చాలా పోలికలు ఉన్నాయంటున్నాడు.

మొత్తమ్మీద అటు వరుణ్ తేజ్, ఇటు సాయిధరమ్ తేజ్ ఇద్దరూ తొలిప్రేమ టైటిల్ ను క్యాష్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. వరుణ్ తేజ్ కు ఈ విషయంలో ఎలాంటి  ఇబ్బంది లేదు. ఎందుకంటే అతడు ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎటొచ్చి సాయిధరమ్ తేజ్ మాత్రం టైటిల్ మిస్ అయినందుకు తెగ బాధపడుతున్నాడు.

కరుణాకరన్ తో చేస్తున్న సినిమాకు తొలిప్రేమ అనే టైటిల్ పెడితే బాగుండేదని క్లోజ్ సర్కిల్ దగ్గర చెప్పుకొని బాధపడుతున్నాడు. అసలే హిట్స్ లేవు, ఇప్పుడు కోరుకున్న టైటిల్ కూడా మిస్ అయ్యేసరికి తేజ్ కు మరింత ఇబ్బందిగా ఉంది.