రెక్కీ పూర్తయింది.. రేసు మొదలుకానుంది

సాహో సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన షెడ్యూల్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించి దుబాయ్, అబుదాదిలో ఏకథాటిగా 3నెలల పాటు షూటింగ్ చేయబోతున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే. …

సాహో సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన షెడ్యూల్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించి దుబాయ్, అబుదాదిలో ఏకథాటిగా 3నెలల పాటు షూటింగ్ చేయబోతున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే. 

ఈ షెడ్యూల్ కోసం 3వారాల ముందే ఆయా ప్రాంతాల్లో పర్యటించాడు దర్శకుడు సుజీత్. దర్శకుడితో పాటు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్, సినిమాటోగ్రాఫర్ మథి కూడా ఇందులో ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి దుబాయ్, అబుదాబిలో పలు లొకేషన్లు ఫిక్స్ చేశారు. 

జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ భారీ షెడ్యూల్ ప్రారంభంకానుంది. హీరోహీరోయిన్లతో పాటు కీలకమైన ఆర్టిస్టులంతా ఇందులో పాల్గొంటారు. డైలాగ్ పార్ట్ కంటే, యాక్షన్ పార్ట్ షూటింగే ఎక్కువగా ఉండబోతోంది.

అయితే దుబాయ్ షెడ్యూల్ కంటే ముందు హైదరాబాద్ లో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారు. వారం రోజుల్లో ఇది స్టార్ట్ అవుతుంది. జనవరి 1నుంచి ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు ప్రభాస్. ఇది కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ అంతా కలిసి దుబాయ్ వెళ్తుంది.