రంగస్థలం-చిరు ఏమన్నారు?

రంగస్థలం.. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. ప్రధానకారణం ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ 1985నేపథ్యంలో చూపించడమే. పాతకాలపు నేపథ్యంలో సినిమాలు మనకు కొత్త కాదు. కానీ దాదాపు…

రంగస్థలం.. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. ప్రధానకారణం ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ 1985నేపథ్యంలో చూపించడమే. పాతకాలపు నేపథ్యంలో సినిమాలు మనకు కొత్త కాదు. కానీ దాదాపు ఈ జనరేషన్ జనాలు అందరికీ గుర్తున్న 1985కాలపు నేపథ్యంలో సినిమా అనగానే కాస్త ఆసక్తి.

అయితే ఇక్కడ మరో పాయింట్ ఏమిటంటే, 1985కాలం నాటి పట్టణాల వాతావరణం కాకుండా పల్లెటూళ్ల నేపథ్యం తీసుకోవడం. అక్కడే సమస్య వచ్చింది. సినిమాకు గ్లామర్ అవసరం అంటే డీ గ్లామర్ వచ్చిపడింది. పైగా ఈ మధ్య లీక్ అయిన సమంత ఫోటోలు ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసాయి. సినిమా గురించి బయ్యర్లు ఆలోచనలో పడేలా చేసాయి. కానీ నిర్మాతలు మాత్రం సినిమా అద్భుతంగా వచ్చిందని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఇటీవల ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూసారని గుసగుసలు ఇండస్ట్రీలో ప్రారంభమయ్యాయి. ఇలా చిరంజీవి చూసిన తరువాతేనే కొన్ని రీషూట్ లు స్టార్ట్ చేసారన్న వార్తలు గుప్పుమన్నాయి. కాస్త డీ గ్లామర్ అంశాలు తగ్గించమని చెప్పారని టాక్ వినిపిస్తోంది. మరోపక్క గతంలో తను నటించిన ఊరుకిచ్చినమాట అనే సినిమా ఛాయల్లోనే రంగస్థలం సినిమా వుంటుందని అప్పుడే చిరంజీవి గమనించారని కూడా గుసగుసలు ప్రారంభమయ్యాయి.

మొత్తం మీద సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున తమ పిల్లల సినిమాల రఫ్ చూసారు అంటే, మళ్లీ మొదలాడు అన్నట్లు రిపేర్లు తప్పవేమో? వాళ్ల టేస్ట్, అనుభవం వేరు. ఈ తరం దర్శకుల టేస్ట్ వేరు కదా?