అనిరుధ్ వీడియో అదిరింది

ఓ సినిమా ప్రమోషన్ కు లేదా ఓ పాట ప్రమోషన్ కు కాస్త హడావుడి చేయడం కామనే. కానీ లక్షలు ఖర్చు చేస్తారా? అజ్ఞాతవాసి సినిమా రెండోపాట ‘గాలి వాలుగా’ సాంగ్ ప్రమోషన్ కోసం…

ఓ సినిమా ప్రమోషన్ కు లేదా ఓ పాట ప్రమోషన్ కు కాస్త హడావుడి చేయడం కామనే. కానీ లక్షలు ఖర్చు చేస్తారా? అజ్ఞాతవాసి సినిమా రెండోపాట ‘గాలి వాలుగా’ సాంగ్ ప్రమోషన్ కోసం అన్నట్లుగా గాయకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఓ వీడియో వదిలారు.

ఈ వీడియోలో అనిరుధ్ దాదాపు తనే హీరో అనే రేంజ్ లో నటించారు, డ్యాన్స్ చేసారు. ఫీలింగ్స్ పంచారు. ఈ వీడియో మేకింగ్ లో రిచ్ నెస్, కాంటెంపరరీ టేకింగ్ క్లియర్ గా తెలుస్తోంది. దీనికోసం ఎకంగా సెట్ నే వేసినట్లుంది. ఎక్కడ పడితే అక్కడ పవన్ స్టిల్స్, పనిలో పనిగా డైరక్టర్ త్రివిక్రమ్ స్టిల్స్ దర్శనమిచ్చాయి.

ఈ వీడియో చూస్తుంటే అనిరుధ్ ఎప్పుడో ఒకప్పుడు స్క్రీన్ మీదకు వచ్చే ఆలోచనతోనే వున్నాడేమో అనిపిస్తోంది. పాట ప్రమోషన్ వీడియోలో ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు. విజవల్ గ్రాఫిక్స్ కూడా జోడించారు. డ్యాన్సర్లను తెచ్చారు. మొత్తం మీద ఆ పాటను స్క్రీన్ మీద పిక్చరైజ్ చేయడానికి ఎలా కష్టపడతారో, ఈ వీడియో సాంగ్ కోసం కూడా అంత కష్టపడినట్లు తెలుస్తోంది.

పాట పిక్చరైజేషన్ కు త్రివిక్రమ్ ఇన్ పుట్స్ ఎంత వున్నాయో ఏమో కానీ, టోటల్ గా చెన్నయ్ కు చెందిన టీమ్ వర్క్ చేసినట్లు క్రెడిట్ లైన్స్ చెబుతున్నాయి. ఈ వీడియో ప్రొడక్షన్ అంతా అనిరుధ్ దే అని వేసారు. అంటే మనవాడే ఖర్చు చేసుకున్నాడని అనుకోవాలి. మొత్తానికి అజ్ఞాతవాసి సినిమా మంచి చెడ్డలు ఎలా వుంటాయన్నది పక్కన పెడితే, అనిరుధ్ తెలుగునాట బాగానే పాపులర్ అయ్యేలా వున్నాడు.

ఈ విడియో యూ ట్యూబ్ లో ట్రెండింగ్ ఫోర్త్ ప్లేస్ లోకి వెళ్లిపోయి, వన్ మిలియన్ కు పైగా హిట్ లు తెచ్చేసుకుంది.