షూటింగ్ లో గాయపడ్డ కళ్యాణ్ రామ్

ఆందోళన అవసరం లేదు. ఇది జరిగి రెండురోజులు అయింది. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో రౌడీ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సీన్లు తీస్తుండగా ఇది జరిగింది. విషయం ఏమిటంటే, జయేంద్ర డైరక్షన్ లో…

ఆందోళన అవసరం లేదు. ఇది జరిగి రెండురోజులు అయింది. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో రౌడీ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సీన్లు తీస్తుండగా ఇది జరిగింది. విషయం ఏమిటంటే, జయేంద్ర డైరక్షన్ లో నిర్మిస్తున్న సినిమా కోసం కొన్ని సీన్లు వికారాబాద్ రైల్వే స్టేషన్ లో చిత్రీకరించారు.

ఈ సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద రౌడీలను ఛేజ్ చేసే సీన్ తీస్తున్నారు. బ్రిడ్జి మీద నుంచి ఫ్లాట్ ఫారమ్ మీదకు మెట్ల మీదుగా కాస్త వేగంగా దిగాలి. కానీ అదే టైమ్ లో పై మెట్టు మీద కళ్యాణ్ రామ్ కాలు స్లిప్ అయింది. దీంతో ఆయన దొర్లుకుంటూ కిందకు వచ్చేసారు.

దీనివల్ల చేయి వాచింది, మణికట్టు బెణికింది. ఆ వెంటనే కారవాన్ లో ఓ అరగంట రిలాక్స్ అయ్యారు. హాస్పిటల్ కు వెళ్దామంటే, వద్దని బయటకు వచ్చి ఆ బిట్ కంప్లీట్ చేసేసారు.

అంతే కాదు, వన్ డే రెస్ట్ తీసుకుని, పెయిన్ కిల్లర్స్ సాయంతో మళ్లీ ఈ రోజు షూటింగ్ కు రెడీ అయిపోయారట. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు సమాంతరంగా చేస్తున్నారు. ఒకదానికి ఉపేంద్ర అనే కొత్త దర్శకుడు, మరోదానికి జయేంద్ర పని చేస్తున్నారు.