బ్యాడ్ లక్: తమన్ చేజారిన సైరా?

మొన్నటివరకు రేసులో ముందున్నాడు. మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనుభవం కలిసొస్తుందని సంబరపడ్డాడు. కానీ తమన్ ఆశలు ఆవిరయ్యాయి. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా వస్తున్న సైరాకు…

మొన్నటివరకు రేసులో ముందున్నాడు. మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనుభవం కలిసొస్తుందని సంబరపడ్డాడు. కానీ తమన్ ఆశలు ఆవిరయ్యాయి. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా వస్తున్న సైరాకు సంగీతం అందించే అవకాశం తమన్ కు దక్కలేదు.

సైరా సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ రామ్ చరణ్ చూసుకుంటున్నాడు. అందుకే అట్నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశాడు తమన్. కానీ స్వయంగా చరణే, తమన్ కు ఈ విషయం చెప్పేశాడట. సైరాకు కాకుండా నెక్ట్స్ వచ్చే సినిమాకు చూద్దామన్నాడట. చూస్తుంటే సంగీత దర్సకుడు ఎవరనే విషయంపై చెర్రీ-చిరు ఇప్పటికే ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చినట్టు కనిపిస్తోంది.

మరోవైపు సైరాలో ఛాన్స్ ఇవ్వకపోయినా తన నెక్ట్స్ సినిమాలో తమన్ కు ఛాన్స్ ఇచ్చాడు చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు తమన్ నే మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నాడు. 

అలా చిరంజీవి సినిమా అవకాశాన్ని కోల్పోయినా.. మరోసారి చరణ్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు తమన్. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో బ్రూస్ లీ అనే మూవీ వచ్చింది.