ఆపిల్ బ్యూటీ హన్సిక మరోసారి ప్రేమలో పడిందట. ప్రస్తుతం కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న హాట్ న్యూస్ ఇదే. హీరో అధర్వ, హన్సిక ఒకర్నొకరు ఇష్టపడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, చాటింగ్ లు జోరుగా సాగుతున్నాయట.
ఇప్పటివరకు వీళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కలిసి సినిమా చేయకపోయినా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారట. అప్పట్నుంచి ఇద్దరూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట. ఈ పుకార్లకు మరింత ఊతమిస్తూ.. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది.
హీరో శింబుతో హన్సిక ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. తామిద్దరం ప్రేమించుకుంటున్నామంటూ హన్సిక స్వయంగా ప్రకటించింది. అది నిజమేనంటూ తర్వాత శింబు కూడా అంగీకరించాడు. అయితే వాళ్ల ప్రేమ వ్యవహారం మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్నుంచి సింగిల్ గా ఉంటున్న హన్సిక, ఇప్పుడిప్పుడే అధర్వకు దగ్గరవుతోందట.