హలో సినిమా ప్రమోషన్ లో భాగంగా విక్రమ్ కుమార్ తో మరో కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు నాగార్జున. విక్రమ్ కుమార్, నాగచైతన్య కాంబినేషన్ లో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే మరో సినిమా ఉంటుందని ప్రకటించాడు. నాగార్జున అయితే చెప్పేశాడు కానీ ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుందా అనే డౌట్ మాత్రం చాలామందిలో ఉంది.
విక్రమ్ కుమార్, నాగార్జున మధ్య చాలా గ్యాప్ వచ్చిందనే విషయం ఇండస్ట్రీలో ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. హలో సినిమా మేకింగ్ టైమ్ లో వీళ్లిద్దరి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. ఒక దశలో విక్రమ్ కుమార్ పనితీరుపై అసహనం కూడా వ్యక్తంచేశాడు నాగ్. ఓ ప్రెస్ మీట్ లో ఆ విషయాన్ని పరోక్షంగా బయటపెట్టాడు కూడా.
అటు విక్రమ్ కుమార్ కూడా నాగ్ వ్యవహార శైలితో విసుగెత్తిపోయాడు. మళ్లీ నాగ్ తో కలిసి ఇప్పట్లో సినిమా ఉండదని తన డైరక్షన్ టీమ్ తో చెప్పేశాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఈ దర్శకుడితో నాగ్ మరో సినిమా ఎనౌన్స్ చేయడం అందర్లో అనుమానాలు రేకెత్తించింది. మరోవైపు విక్రమ్ కుమార్ తో సినిమా గురించి తనకేం తెలియదని నాగచైతన్య అనడం విడ్డూరం.