ఒక్కో కథ ఒక్కోలా పుడుతుంది. ఒక్కో సినిమా ఒక్కోలా తయారవుతుంది. రంగస్థలం సినిమా కథ విషయంలో కూడా మెగా కాంపౌండ్ సన్నిహితుల్లో ఓ విషయం వినిపిస్తోంది. రంగస్థలం కథ వెనుక అల్లు అర్జున్ వున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ గుసగుసల సారాశం ప్రకారం జరిగింది ఏమిటంటే, బన్నీ కొన్ని వేరే లాంగ్వేజ్ సినిమాలు చూసి కాస్త ఇన్ స్పయిర్ అయ్యారు. ఆ సినిమాల గురించి సుకుమార్ కు చెప్పారట. ఇలాంటి వాటితో, ఈ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వెలిబుచ్చారని వినికిడి. ఆ మేరకు సుకుమార్ ను కథ తయారుచేయమని కోరారట.
కట్ చేస్తే వన్ ఫైన్ మార్నింగ్, సుకుమార్ వచ్చి రామచరణ్ తో సినిమా చేస్తున్నా అని చెబుతూ.. అదే మీరు చెప్పారు కదా ఐడియా, అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని, ఆ ఐడియాతోనే కథ చేసా, చెప్పాడట..దాంతో బన్నీ నవ్వేసి, ఓకె గుడ్ అని ఊరుకున్నట్లు మెగా కాంపౌడ్ వర్గాల బోగట్టా. అంటే బన్నీ తన కోసం అయిడియా ఇస్తే, సుకుమార్ దాన్ని రామ్ చరణ్ కు వాడేసారని అనుకోవాల్సి వస్తోంది.
ఈ సినిమా కూడా అంతేనా?
ఇదిలా వుంటే తను రిజెక్ట్ చేసి, ఆ తరువాత మరో హీరో రిజెక్ట్ చేసిన కథనే ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తీసుకున్నట్లు మరో గుసగుస వినిపిస్తోంది. గతంలో బోయపాటి ఓ కథ చెపితే అంతగా నచ్చలేదన్నాడట రామ్ చరణ్. మళ్లీ అదే కథను బెల్లంకొండ శ్రీనివాస్ కు చెబితే, నచ్చక, జయజానకీ నాయక కథను ఎంచుకున్నాడట. అలా రెండు సార్లు ఇద్దరు వద్దన్నకథే కాస్త రిపేర్లు చేస్తే, ఇప్పుడు రామ్ చరణ్ ఓకె చేసాడని టాక్ వినిపిస్తోంది. ఎంతవరకు నిజమో మరి?