పైసా వసూల్ సినిమా నిర్మాతలు భవ్య క్రియేషన్స్ కు ఏం మేలు చేసిందో, ఏ మేరకు పైసా వసూలు చేసిందో ఏమో కానీ, హీరో బాలయ్యకు మాత్రం మంచే చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాకు గాను నిర్మాతలు ఒకేసారి బాలయ్య రెమ్యూనిరేషన్ ను భారీగా పెంచేసారు. ఈ సినిమా నుంచే బాలయ్య 10కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోవడం ప్రారంభించారు. దాంతో ఇప్పుడు అదే ఫిక్సయిపోయిందని తెలుస్తోంది.
సి కళ్యాణ్-కేఎస్ రవికుమార్ సినిమాకు కూడా బాలయ్య రెమ్యూనిరేషన్ పదికోట్లే అని ఇండస్ట్రీ సర్కిళ్ల భోగట్టా. ఇదిలా వుంటే 2018లో కనీసం మూడు సినిమాలు చేయాలని బాలయ్య టార్గెట్ గా పెట్టుకున్నారట. జనవరి లో ఒకటి, జూన్ లో ఒకటి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండూ అయిపోయాకే బయోపిక్ కు వెళ్లాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఏప్రియల్ కే తాను ఫ్రీ అయిపోతానని, కావాలంటే బయోపిక్ స్టార్ట్ చేసుకోవచ్చనీ దర్శకుడు తేజ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ రెండు కమర్షియల్ సినిమాలు చేసాకే బయోపిక్ అన్న కొత్త ఆలోచన కూడా వున్నట్లు తెలుస్తోంది.
జనవరి నుంచి ఎస్వీ కృష్ణా రెడ్డి సినిమా ఎక్కించాలా? వద్దా? అన్నదానిపై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ తరువాత బోయపాటి ప్రాజెక్టు. ఇవి కాక, ఈ మధ్య బాలయ్య కొంతమంది దర్శకులు చెబుతున్న కథలు కూడా సీరియస్ గా వింటున్నారు. వాటిల్లో ఏదయినా సెట్ అయితే ప్లాన్ లు అన్నీ మారతాయి.
ఏమయినా, ఈ ఏజ్ లో కూడా ఏడాదికి మూడు సినిమాలు, ముఫైకోట్లు అంటే బాలయ్య బాబు గొప్పోడే.