కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ను పక్కన పెట్టి ఒకేసారి రెండు సినిమాలు బయట బ్యానర్ లలో స్టార్ట్ చేసారు. ఒకటి కొత్త దర్శకుడు ఉపేంద్ర డైరక్షన్ లో ఎమ్ఎల్ఎ. రెండవది సీనియర్ టెక్నీషియన్ డైరక్టర్ జయేంద్ర డైరక్షన్ లో. ఈ రెండు సినిమాలు కూడా కాస్త గ్యాప్ లో ప్రారంభమయ్యాయి. చకచకా పూర్తవుతున్నాయి. ఒకదాంట్లో కాజల్ మరో దాంట్లో తమన్నా కధానాయకులు.
సినిమాలు నిర్మాణంలో వుండగానే మార్కెటింగ్ స్టార్ట్ అయిపోయింది. జయేంద్ర డైరక్షన్ లోని సినిమాకు కొద్ది రోజుల క్రితమే శాటిలైట్ అయిపోయింది. 4.50 కోట్లు ప్లస్ జిఎస్టీ అంటే 4.75 కోట్ల రేంజ్ లో ఆ సినిమా శాటిలైట్ అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు రెండో సినిమా ఎమ్ఎల్ఎ కూడా శాటిలైట్ అయిపోయింది. ఇది కూడా అదే రేటుకు శాటిలైట్ కావడం విశేషం.
కళ్యాణ్ రామ్ నటించే మీడియం రేంజ్ సినిమాలకు ఈ రేంజ్ శాటిలైట్ కావడం అంటే చెప్పుకోదగ్గ విషయమే. జెమిటి టీవీనే ఈ రెండు డీల్స్ ఫైనల్ చేసింది. హిట్ అనిపించుకున్న సినిమాలకు కూడా శాటిలైట్ కావడం లేదు. అవుతున్నా నాలుగు కోట్లు కూడా రావడం లేదు. అలాంటిది విడుదలకు ముందే ఈ రేంజ్ శాటిలైట్ అంటే కళ్యాణ్ రామ్ టైమ్ బాగుంది.