బాహుబలి క్రేజ్ మరీ ఈ రేంజ్ లోనా?

చీరలు, డ్రెస్ లు సినిమాల పేరిట రావడం మనకు కొత్త కాదు. వాణిళ్రీ కాలం నుంచే వుంది. ఆ మధ్య బాహుబలి చీరలు వచ్చాయి. ఆ చీరల మీద అనుష్క, ప్రభాస్ ల ఫొటోలు…

చీరలు, డ్రెస్ లు సినిమాల పేరిట రావడం మనకు కొత్త కాదు. వాణిళ్రీ కాలం నుంచే వుంది. ఆ మధ్య బాహుబలి చీరలు వచ్చాయి. ఆ చీరల మీద అనుష్క, ప్రభాస్ ల ఫొటోలు ప్రింట్ చేస్తే గోదావరి జిల్లాల మహిళాభిమానులు ఆనందంగా కట్టేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా బాహుబలి జ్యూయలరీ వచ్చేసినట్లుంది. ఆ ఫోటోలు వాట్సప్ లో హల్ చల్ చేస్తున్నాయి. బాహుబలి సినిమాలోని కీలక ఘట్టాలును తీసుకుని లాకెట్ లు గా మార్చేసారు.

శివగామి, బాల బాహుబలిని చేతితో ఎత్తుకుని నీళ్లలో మునిగిపోతున్న సీన్, బాహుబలి 2లో అత్యంత పాపులర్ అయిన మహేంద్ర బాహుబలి ఏనుగును ఎక్కే సీన్. అలాగే సింహాసనంపై బాహుబలి ఠీవిగా కూర్చున్న దృశ్యం లాకెట్ లుగా మార్చేసారు కళాకారులు. టెంపుల్ జ్యూయలరీ అన్నది జ్యూయలరీలో ఓ డిజైనింగ్ కేటగిరీ. ఆ కేటగిరీ టైపులోనే ఈ బాహుబలి డిజైన్లు చేసేసారు.

కానీ చీర, చొక్కా అంటే వందలతో సరిపోతుంది. బంగారు నగలు అంటే, అందులోనూ ఈ టెంపుల్ జ్యూయలరీ టైపు అంటే లక్షలు కావాలి. మళ్లీ భీమవరంలో బాగా డబ్బుచేసిన ప్రభాస్ అభిమానుల ట్రయ్ చేయాల్సిందే తప్ప మామూలు వాళ్లకు వీలు కాదు.