సప్తగిరికి సోలోగా వదిలేస్తున్నారు

దాదాపు నెల రోజుల నుంచి వారానికి మూడు నుంచి ఆరు సినిమాలు. పోటా పోటీ. అసలే అంతంతమాత్రం ఓపెనింగ్ లు. దానికి తోడు పంచుకోవడం. ఇలాగే సాగుతూ వస్తోంది వ్యవహారం. కానీ డిసెంబర్ ఫస్ట్…

దాదాపు నెల రోజుల నుంచి వారానికి మూడు నుంచి ఆరు సినిమాలు. పోటా పోటీ. అసలే అంతంతమాత్రం ఓపెనింగ్ లు. దానికి తోడు పంచుకోవడం. ఇలాగే సాగుతూ వస్తోంది వ్యవహారం. కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ మాత్రం డిఫెరంట్ గా వుండేలా వుంది. హీరో టర్నడ్ కమెడియన్ సప్తగిరి నటించిన సప్తగిరి ఎల్‌ఎల్‌బి విడుదలవుతోంది. దానికి పెద్దగా పోటీ కనిపించడం లేదు. సుమంత్ నటించిన మళ్లీ రావా వస్తోంది కానీ, పరిస్థితి తెలిసిందే. సుమంత్ ను జనం దాదాపు మరిచిపోయిన పరిస్థితి. 

ఎందుకు ఈ డేట్ ను వదిలేసారో మరి. మళ్లీ 21నుంచి నెలాఖరు వరకు సినిమాలు కుమ్మేస్తున్నాయి. ఫస్ట్ వీక్, సెకెండ్ వీక్ మాత్రం వదిలేసారు. సప్తగిరికి కలిసి వస్తున్న మరో అంశం ఏమిటంటే, దాదాపు మూడు వారాలుగా సరైన ఎంటర్ టైన్ మెంట్ సినిమా లేదు. ఈవారం విడుదలైన సినిమాల ఏవీ పెద్దగా థియేటర్లలో వుండే అవకాశం కనిపించడం లేదు. 

దీంతో జనాల పరిస్థితి ఎలా వుందీ అంటే కాస్త ఎంటర్ టైన్ మెంట్ వుంటే చాలు అనుకుంటున్నారు. అందువల్ల ఈ టైమ్ లో ఎ సెంటర్ల సంగతి ఎలా వున్నా, బి, సి సెంటర్లకు సరిపడే వినోదం సప్తగిరి ఎల్‌ఎల్‌బి లో దొరికితే చాలు. రెండు వారాలు అంటే 21న ఎంసిఎ వచ్చేవరకు వేసుకోవచ్చు.