అన్నపూర్ణ స్ట్రాటజీ అదేనా?

సంక్రాంతికి కిందా మీదా అయిపోతున్నాయి నాలుగు అయిదు సినిమాలు. ఇలాంటి పరిస్ధితిలో రాజ్ తరుణ్ రంగుల రాట్నం కూడా రెడీ అవుతోంది. మహా మహా సినిమాల నడుమ దీనికి థియేటర్లు ఎలా వస్తాయా అని…

సంక్రాంతికి కిందా మీదా అయిపోతున్నాయి నాలుగు అయిదు సినిమాలు. ఇలాంటి పరిస్ధితిలో రాజ్ తరుణ్ రంగుల రాట్నం కూడా రెడీ అవుతోంది. మహా మహా సినిమాల నడుమ దీనికి థియేటర్లు ఎలా వస్తాయా అని అనుమానాలు ఉన్నాయి.

అయితే దీని వెనుక ఓ స్ట్రాటజీ ఉందట అన్నపూర్ణ సంస్థకు. అదేమిటంటే అన్నపూర్ణ సంస్థ నిర్మించిన హలో డిసెంబర్ 22 న విడుదల అవుతోంది. ఆ సినిమాకు ఎలాగూ ఫుల్ రన్ లేదా మూడు నుంచి నాలుగు వారాలు అగ్రిమెంట్ చేస్తారు. అవసరం అయితే పొడిగించే వీలు ఎలాగూ ఉంటుంది.

డిసెంబర్ 22కు జనవరి14కు ఎంత గ్యాప్? నాలుగు వారాలు. అందువల్ల హలో థియేటర్ లు కొన్ని పొడిగించుకుంటే చాలు. అదీ ధీమా అంట. బాగానే ఉంది. కానీ జనవరి10న వస్తున్న భారీ సినిమా ఆజ్ఞతవాసికే ఇప్పటి నుంచి హడావుడి స్టార్ట్ చేస్తే, రాజ్ తరుణ్ చిన్న సినిమాకు ఇప్పటి వరకు ఓ లుక్ లేదు.. టైటిల్ ప్రకటన లేదు.

ఇదిలా ఉంటే పండుగకే వస్తుంది అని ముందుగా రుమాలు వేసిన రాజ్ తరుణ్ – ఏ కె వారి రాజుగాడు సినిమా జనవరి నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలుస్తోంది.