ఏ సినిమా అయినా హీరో డైరెక్టర్ కాంబినేషన్ కీలకం. ముఖ్యంగా డైరెక్టర్ ఎవరన్న దాని మీద బిజినెస్ ఆధార పడుతుంది. అల్లు శిరీష్ రేంజ్ హీరో గా ఎంత అన్నది అందరికి తెలిసిందే.
అందుకే అల్లు శిరీష్ కు సరైన డైరెక్టర్ లను ఫిక్స్ చేయడం అన్నది స్ట్రాటజీగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది అల్లు అరవింద్. కొత్త జంట సినిమాకు మారుతి, శ్రీరస్తు శుభమస్తుకు పరుశురాం లాంటి డైరెక్టర్ తోడయ్యారు. దాంతో ఆ రెండు సినిమాలు పాస్. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ఒక్క క్షణం. దీనికి ఆనంద్ దర్శకుడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ఆనంద్ సత్తా అందరికి తెలిసింది.
అందుకే ఒక్క క్షణం సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. 3కోట్ల రేంజ్ లో శాటిలైట్ ముందే చేసేసారు. 6కోట్ల రేంజ్ లో ఆంధ్ర అమ్మేశారు ఇప్పుడు. నైజాంకు మూడు కోట్ల అడ్వాన్స్ మీద ఇచ్చారు. దీంతో నిర్మాత ఖర్చులు వచ్చేసాయి. ఇందులో మిగిలిన కాస్త ప్లస్ సీడెడ్ కలిసి లాభం.
8కోట్ల బడ్జెట్ అనుకుంటే 10కి డేకింది. లేకపోతే ఇంకా మిగిలేది. మొత్తం మీద డైరెక్టర్ ఆనంద్ టాలెంట్ బాగానే క్యాష్ అయింది. అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమా తెచ్చిన లాభం ముందుగా ఇదే నిర్మాత అందించిన కేరాఫ్ సూర్య పట్టుకు పోయింది. అదే బ్యాడ్ లక్ అంటే.