తెలుగు నాట ముదురు హీరోలు అందరికీ ఒకటే సమస్య. హీరోయిన్లు. బాలయ్య అంటే ఎవరో ఒకరితో అడ్జస్ట్ అయిపోతారు. మిగిలిన వారు అలా కాదు, వెదుకుతారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా అదే పని మీద వున్నారు. తేజ డైరక్షన్ లో సినిమా ప్లానింగ్ లో వుంది. కథ వండకం జరుగుతోంది. సురేష్ మూవీస్ లో కథ లాక్ చేయడం అంటే అంత వీజీ కాదు. అందుకే ఇప్పుడు అదే పని మీద వున్నారు డైరక్టర్ తేజ. మరో సమస్య ఏమిటంటే హీరోయిన్.
ముందుగా కాజల్ అయితే అన్న చిన్న ఆలోచన చేసారు. కానీ మొన్నటికి మొన్నే రానాతో చేసిన వెంటనే వెంకీతో చేస్తే అంత బాగుంటుందా? అన్నది డిస్కషన్ కు వచ్చింది. అందుకే మరో హీరోయిన్ కోసం వెదుకులాట ప్రారంభమైంది. కథ ప్రకారం కాస్త మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. అందువల్ల కాస్త ముదురు హీరోయిన్ కావాలి. ఎవరు? ఎవరు? ఎవరు?
13న కాదు
ఇదిలా వుంటే డిసెంబర్ 13న వెంకీ-తేజ సినిమా ఓపెనింగ్ అని వార్తలు పుట్టించారు. ఇది కూడా సవాలక్ష గాలివార్తల్లో ఒకటి అంట. ఎందుకంటే ఆ రోజు వెంకీ బర్త్ డే కాబట్టి, ఓపెనింగ్ వుంటుందని ఊహాగానాలు చేసేసారు. కానీ ఆ రోజు వెంకీ అవుటాఫ్ స్టేషన్ లో వుంటారట. అందువల్ల ఆ రోజు 99పర్సంట్ ఓపెనింగ్ వుండదని తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక కాకుండా ఓపెనింగ్ చేయడం అంత ఇష్టం లేనట్లు తెలుస్తోంది.