ఇండస్ట్రీలో స్మూత్ గా పనులు చేసుకునే ఆర్గనైజేషన్లలో యువి క్రియేషన్స్ ఒకటి. ఇండస్ట్రీలోని అందరితో కలిసి వ్యాపారాలు సాగించడం యువి స్పెషాలిటీ. అటు గీతా, ఇటు దిల్ రాజు, తమిళ నాట జ్ఞాన్ వేల్ రాజా ఇలా ప్రతి ఒక్కరితో ఎక్కడో ఏదో ఒక లింక్. అదే కలసి వస్తోంది ఆ సంస్థకు. సంక్రాంతికి విడుదల చేస్తున్న తమిళ సూపర్ స్టార్ సూర్య సినిమా గ్యాంగ్ యువి సంస్థకు ఏ పెట్టుబడి లేకుండా డిస్ట్రిబ్యూషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
జ్ఞాన్ వేల్ రాజా ఎప్పుడూ తెలుగులో తన సినిమాలను దగ్గర వుండి విడుదల చేసుకుంటూ వుంటారు. అయితే గత కొంత కాలంగా యూవితో అనుబంధం, వ్యాపార బంధం వచ్చింది. అందుకే ఈసారి గ్యాంగ్ సినిమాను యువి క్రియేషన్స్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. విడుదల ఖర్చలు, పబ్లిసిటీ పెట్టి విడుదల చేసి పెట్టమని. యువి కూడా హ్యాపీగా సై అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సంస్థ నిర్మించిన భాగమతి సినిమా విడుదలకు రెడీగా వుంది.
గ్యాంగ్ విడుదలయిన వారం తరువాత అది విడుదలవుతుంది. ఈ సినిమాను తమిళంలో విడుదల చేసే బాద్యత అంతా జ్ఞాన్ వేల్ రాజా చేతిలో పెట్టారు. అంటే ఒక విధంగా బార్టర్ సిస్టమ్ అన్నమాట. వీళ్ల సినిమాను ఆయన విడుదల చేస్తారు. ఆయన సినిమాను వీళ్లు పంపిణీ చేస్తారు. బాగుందిగా ఇదేదో?