అదిగో సినిమా అంటే ఇదిగో వార్త అన్నట్లు తయారయింది పరిస్థితి. గాలిమాటలు పట్టుకుని రాస్తున్న వార్తలు చూసి సినిమా జనాలే నవ్వుకుంటున్నారు. ఒకపక్క దిల్ రాజు ఎంసీఏ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 21న విడుదలకు రెడీ అవుతోంది. 15నే విడుదల చేయాలని అనుకున్నా, వర్క్ ఫినిష్ కాలేదు.
కానీ ఇచ్చిన మాట తప్పి 21న రావద్దని అరవింద్ అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఏడాది ఆరు సినిమాలు విడుదల చేయాలన్నది తన టార్గెట్ అని దిల్ రాజు చెప్పేసారు.
దాంతో ఇక తప్పక, అల్లు అరవింద్ తన కొడుకు శిరీష్ సినిమాను 29కి వాయిదా వేసుకునే ప్రయత్నాల్లో వున్నారు. నాగార్జున కూడా ఇంక ఏమీ మాట్లాడలేక మౌనంగా వున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు ఎంసీఏ 21న విడుదల చేస్తున్నట్లు వర్తమానం వెళ్లిపోయింది.
ఇది వాస్తవం అయితే సంక్రాంతికి వాయిదా పడిపోయింది, సంక్రాంతి తరువాత విడుదల అంటూ కథనాలు రావడం చూసి ఆఖరికి ఈరోజు అధికారికంగా ప్రకటించేయాలని దిల్ రాజు యూనిట్ డిసైడ్ అయిపోయింది. గంటకో గడియకో ఆ మేరకు ప్రకటన వస్తుంది.