కేశవ సినిమా తరువాత హీరో నిఖిల్ చేస్తున్న సినిమా కిర్రాక్ పార్టీ. కన్నడంలో ఇదే టైటిల్ తో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రీమేక్ చేస్తోంది.
ఇద్దరు డైరక్టర్లు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందు మొండేటి మాటలు అందించారు. చందు మొండేటి అసిస్టెంట్ శరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్ ఈనెల 30న, ఫస్ట్ లుక్ విత్ టైటిల్ డిసెంబర్ 2న విడుదల చేసే సన్నాహాల్లో వున్నారు.
ఇదిలా వుంటే ఈ సినిమా కోసం ఎన్ని టైటిళ్లు ఆలోచిస్తున్నా, కిర్రాక్ పార్టీ అన్న దానికి సరైన రీ ప్లేస్ మెంట్ దొరకడం లేదని వినికిడి. మెజారిటీ అభిప్రాయాలు అన్నీ కిర్రాక్ పార్టీ అన్న టైటిల్ నే బెటర్ అని వస్తున్నాయట. అందుకే కిర్రాక్ పార్టీ అన్నది ఫిక్స్ చేసేసారు. కన్నడంలో కిర్రిక్ పార్టీ అని వుంటుంది. తెలుగులో కిర్రాక్ అని మార్చేసారు.
కిర్రాక్ అన్న పదం తెలుగు జనాలకు కూడా పరిచయం అయిపోయింది కాబట్టి, నెటిజన్లకు కిర్రాక్ పార్టీ సినిమా గురించి తెలుసు కనుక, ఆ టైటిల్ నే అలా వదిలేస్తే బెటర్ అన్న ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. రెండు మూడు టైటిళ్లు డిస్కషన్ వరకు వచ్చాయి. కానీ కిర్రాక్ పార్టీ కేసే మొగ్గు వున్నట్లు తెలుస్తోంది.