పవన్ 50 మహేష్ 45

సినిమాల్లో హీరోల మాటలు కోటలు దాటతాయి. చేతలు అంతకన్నా గొప్పగా వుంటాయి. అందుకే అభిమానులు అలాంటి సినిమాలంటే చొక్కాలు చించేసుకుంటారు. థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. ఆ కలెక్షన్లు చూపించి తరువాతి సినిమాకు అమ్మకం రేట్లు…

సినిమాల్లో హీరోల మాటలు కోటలు దాటతాయి. చేతలు అంతకన్నా గొప్పగా వుంటాయి. అందుకే అభిమానులు అలాంటి సినిమాలంటే చొక్కాలు చించేసుకుంటారు. థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. ఆ కలెక్షన్లు చూపించి తరువాతి సినిమాకు అమ్మకం రేట్లు అమాంతం పెంచేస్తారు. రాబోయే రెండు సినిమాల ధరవరలు ఇలాగే వున్నాయి.

ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి. ఈ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? క్రేజ్ వీర లెవెల్లో వుంటుంది. అందుకే ఆ సినిమా ఆంధ్ర ఓన్లీ 50 కోట్ల రేషియోలో అమ్మేసారు. పవన్ సినిమాల్లో కొత్త రికార్డు ఇది.

ఇక రెండో సినిమా మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లోని భరత్ అనే నేను. ప్రస్తుతానికి మహేష్ బాబు హిట్ లైన్ లో లేడు. అయినా కూడా అతని రేంజ్ తక్కువేమీ కాదు. దీనికి తోడు గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు వుండనే వుంది. కొరటాల శివ ఇంతవరకు ఫ్లాప్ తీయలేదన్న భరోసా వుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాను ఆంధ్ర ఏరియాకు 45కోట్ల రేషియోలో చెబుతున్నారట. స్పైడర్ పోయింది కదా? అని బయ్యర్లు ఎవరూ వెనకడుగు వేయడంలేదు. కొరటాలను చూసి కోనేందుకు ఎదురు ఆఫర్లు ఇవ్వడం స్టార్ట్ చేసారట. హీరోల మీద బయ్యర్ల భరోసా గురించి ఇంకేం చెప్పాలి?

చూస్తుంటే, ఇక భవిష్యత్ లో పెద్ద హీరో-పెద్ద డైరక్టర్ కాంబినేషన్ అంటే ఆంధ్రకు 50కోట్ల రేటు అన్నది కామన్ లేదా మినిమమ్ అయిపోతుందేమో?