బడ్జెట్ ఎక్కువగా పెట్టడం వల్ల గరుడవేగ సినిమా లాభాల బాట పట్టలేకపోయింది. తాజాగా కుదిరిన శాటిలైట్ రైట్స్ డీల్ తో కాస్త కుదుటపడింది. అయితే సినిమా మాత్రం సక్సెస్ అయింది. రాజశేఖర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్స్ గా నిలిచింది. అయితే ఆ సక్సెస్ ప్రభావం మాత్రం రాజశేఖర్ పై అంతగా కనిపించడంలేదు.
అవును.. గరుడవేగ సక్సెస్ తర్వాత కూడా ఈ సీనియర్ హీరో ఖాళీగానే ఉన్నాడు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేకపోయాడు రాజశేఖర్. నిజానికి ఈమధ్యే రాజశేఖర్ వద్దకు 2 స్క్రిప్టులు వచ్చాయి. కానీ ఆ రెండూ యాక్షన్ కథలే. ఈ నటుడ్ని మళ్లీ రొటీన్ లో పడేసే స్క్రిప్టులే. అందుకే వాటిని రిజెక్ట్ చేశాడు రాజశేఖర్.
ఏ కథకు కమిట్ అయినా.. ఆ ప్రాజెక్టును సొంతంగా నిర్మించే ప్లాన్స్ లో ఉన్నాడు రాజశేఖర్. గరుడవేగ సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలంటే నెక్ట్స్ సినిమాకు తనే నిర్మాతగా మారడం కరెక్ట్ అని భావిస్తున్నాడు. ఈ విషయంలో తెరవెనక మొత్తం చూసుకోవడానికి జీవిత ఉండనే ఉన్నారు.
ప్రస్తుతానికైతే ఈ హీరో ఇంకా గరుడవేగ సక్సెస్ లోనే ఉన్నాడు. వెబ్ మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు, టీవీ మీడియాకు వీకెండ్ స్పెషల్స్ ఇస్తూ బిజీగా కనిపిస్తున్నాడు. డిసెంబర్ లో తన కొత్త సినిమాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వెల్లడించే అవకాశముంది.