ఒక్కోసారి తమని, తమ ప్రాజెక్టును కాస్త ఎక్కువగా అంచనా వేసుకుంటే సమస్యలు వస్తాయి. సైరా బృందం విషయంలో ఇలాగే జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ సినిమా, సైరా లాంటి సూపర్ ప్రాజెక్టు, ఒకె అనడానికి అంతకన్నా ఏం కావాలి? అని అనుకున్నారు. దాంతో ఇప్పుడు విషయం రివర్స్ అయింది.
సైరా సినిమా ఓపెనింగ్ టైమ్ కు మ్యూజిక్ డైరక్టర్ గా రెహమాన్ వుంటే బాగుంటుంది అనుకున్నారు. చిరుకు సన్నిహితుడు అయిన నిర్మాత టాగోర్ మధు గతంలో రెహమాన్ తో ఓ సినిమా చేసారు. అందువల్ల ఒప్పించడం పెద్ద కష్టం కాదు అనుకున్నారు. జస్ట్ 'మా వాళ్లు వచ్చి మాట్లాడుతారు' అని చెప్పేసి రెహమాన్ పేరును యూనిట్ లో చేర్చేసినట్లు తెలుస్తోంది.
కానీ తీరా రెహమాన్ తో డిస్కషన్ స్టేజ్ కు వచ్చేసరికి చాలా సమస్యలు పుట్టుకు వచ్చినట్లు వినికిడి. తమిళ సినిమాల సంగతి పక్కన పెడితే రెహమాన్ వేరే ప్రాజెక్టులు అంటే ఆచి తూచి ఓకె అంటారు. అందుకే సైరా విషయంలో చాలా ఆలోచించినట్లు, ఆఖరికి వ్యవహారం బెడిసినట్లు తెలుస్తోంది.
అయితే ఇది జరిగి కొద్ది రోజులు అయినా బయటకు రానివ్వలేదు. మరో ఆల్టర్ నేటివ్ కోసం వెదుకుతున్నారు. అది సెట్ అయ్యాక బయట పెడదాం అనుకుంటే, రెహమాన్ కారణంగా బయటకు వచ్చేసింది.
ఇప్పుడు చిరు బృందం సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. సరైన మ్యూజిక్ డైరక్టర్ ను వెదికి పట్టాలి. ప్రాజెక్టుకు నేమ్ ఏడ్ అయ్యే రేంజ్ లో వుండాలి. ఒక పక్క డైరక్టర్ సురేందర్ రెడ్డికి మ్యూజిక్ డైరక్టర్ థమన్ అంటే ఇష్టం. అందువల్ల రెహమాన్ ప్లేస్ లో థమన్ ను తీసుకుని టిట్ ఫర్ టాట్ అనేలా మాంచి ఆల్బమ్ ఇవ్వడమా? లేక, ప్రాజెక్టుకు మరో మాంచి నేమ్ జోడయ్యేలా బాలీవుడ్ నుంచి ఎవర్నైనా తీసుకురావడమా? అని కిందా మీదా అవుతోంది సైరా యూనిట్.