సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్లు ఉదయం ప్రకటించి సాయంత్రానికి టైటిల్ ఫస్ట్ లుక్ వదిలేసాడు. అంతే కాదు సినిమా నిర్మాణం 80శాతం పూర్తయిందని చెప్పేసాడు. టైటిల్ చిత్రంగా వుంది. ‘అ ! ’. ఈ సినిమా లోగో చిత్రంగా వుంది. రొమాన్స్, గన్, అవయువ దానం, భగవద్గీత ఇలా చాలా సింబాలిక్ గా వుంది. ఇన్ని కలగలసిన కథేంటీ అన్న డిస్కషన్ స్టార్ట్ అయింది జనాల్లో. పైగా నాని కూడా తన విడియో బైట్ లో చెప్పనే చెప్పాడు చాలా డిఫరెంట్ కథ అని.
ఇప్పుడు ఇవన్నీ కలిసి ఓ చిత్రమైన విషయం వినిపిస్తున్నాయి. నాని మళ్లీ ఈగ లాంటి సినిమా ఏదో చేస్తున్నాడన్నది ఆ చిత్రమైన విషయం. నిజమో కాదో తెలియదు కానీ ఓ చేప పిల్ల ఈ కథకు మూలం అనే టాక్ వినిపిస్తోంది.
ఓ చేప చుట్టూ కథ తిరుగుతుందనో, మరోటనో టాక్ వినిపిస్తోంది. అయితే కరెక్ట్ డిటయిల్స్ ఇంకా బయటకు రావాల్సి వుంది. కానీ డిఫరెంట్ ప్రయత్నం ఏదో చేస్తున్నారు అన్న విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తోంది.
మరి నిర్మాణంలో పార్టనర్ షిప్ తీసుకుని, తన ఫ్రెండ్ తో సినిమా నిర్మాణం చేస్తున్నాడు అంటే నాని కి కథ విషయంలో ఏదో పాయింట్ నచ్చి, పిచ్చ కాన్ఫిడెన్స్ ఇచ్చి వుండాలి. అదేంటీ అన్నది కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తుంది.