నాకు అక్రమ సంబంధాలున్నాయ్: హీరో రాజశేఖర్

పెళ్లికి ముందు, జీవితతో పెళ్లి తర్వాత… తనకు వైవాహికేతర సంబంధాలున్నాయని చెప్పారు ప్రముఖ నటుడు రాజశేఖర్. పీఎస్‌వీ గరుడ వేగ సినిమాతో మంచి ఊపు మీద ఉన్న ఈ హీరో.. ఒక యూట్యూబ్ చానల్…

పెళ్లికి ముందు, జీవితతో పెళ్లి తర్వాత… తనకు వైవాహికేతర సంబంధాలున్నాయని చెప్పారు ప్రముఖ నటుడు రాజశేఖర్. పీఎస్‌వీ గరుడ వేగ సినిమాతో మంచి ఊపు మీద ఉన్న ఈ హీరో.. ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. పెళ్లికి ముందు సంగతి పక్కన పెడితే.. పెళ్లి తర్వాత కూడా తనకు కొంతమంది స్త్రీలతో సంబంధాలున్నాయని రాజశేఖర్ చెప్పడం గమనార్హం.

రాజశేఖర్ – జీవితలు సెలబ్రిటీ కపుల్స్ లో ప్రముఖమైన వాళ్లని వేరే చెప్పనక్కర్లేదు. అనునిత్యం కలిసి కనిపిస్తూ వీళ్లు జీవితారాజశేఖర్ గా పేర్లు కూడి కలిసిపోయి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యం ప్రైవేట్ అఫైర్స్ గురించి రాజశేఖర్ ఓపెన్ గానే చేశాడు. జీవితతో వివాహానంతరం కూడా తనకు వేరే స్త్రీలతో సంబంధాలున్నాయని చెప్పాడు.

అవన్నీ యాక్సిడెంటల్ గా ఏర్పడినవి… వన్ నైట్ స్టాండ్స్ తరహావి అన్నట్టుగా రాజశేఖర్ చెప్పాడు. అంతకు మించిన సీరియస్ బంధం ఏమీ లేదని చెప్పాడు. మరి ఆ మాత్రం చాలదా? ఏదేమైనా రాజశేఖర్ బోల్డ్ గానే చెప్పాడు. సినిమా ఫీల్డ్ లోని చాలా మంది సీనియర్ నిర్మాతలు, దర్శకులు.. తాము శ్రీరామ చంద్రులం అని చెప్పుకొంటూ ఉంటారు. వాళ్ల గురించి లోపల చాలా ప్రచారాలే ఉన్నా వాళ్లు మాత్రం శుద్దపూసలం అని చెప్పుకొంటూ ఉంటారు.

అయితే రాజశేఖర్ మాత్రం ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. మరి ఈ మాటలకు జీవిత రియాక్షన్ ఎలా ఉంటుందో! ఇక తారా చౌదరి విషయంలో కూడా రాజశేఖర్ వివరణ ఇచ్చాడు. రాజశేఖర్ తో తనకు సంబంధం ఉందని ఆమె చెప్పుకొన్నారు గతంలో.. అయితే అలాంటిది ఏమీ లేదని, ఆమె తనతో ఎక్కడో ఫొటో దిగి.. అఫైర్ అని ప్రచారం చేసుకుందని రాజశేఖర్ వివరణ ఇచ్చుకున్నాడు.