సరిగ్గా 5 రోజుల కిందట కమల్ హాసన్ పుట్టినరోజు జరిగింది. ఎలాంటి సంబరాలు లేకుండా సింపుల్ గా జరిగిన ఈ బర్త్ డే నాడు విశ్వరూపం-2సినిమా టీజర్ వస్తుందని అంతా ఊహించారు. కమల్ కూడా పరోక్షంగా అదే చెబుతూ వచ్చాడు. కానీ విశ్వరూపం-2టీజర్ రాలేదు. కేవలం తన రాజకీయ పార్టీకి సంబంధించి యాప్ ను మాత్రం రిలీజ్ చేసన కమల్, సినిమా ప్రస్తావన తీసుకురాలేదు.
తాజా సమాచారం ప్రకారం కావాలనే టీజర్ ను పుట్టినరోజున విడుదల చేయలేదని తెలుస్తోంది. తన రాజకీయ రంగప్రవేశాన్ని మరింత సులభతరం చేసేందుకు టైమ్ చూసి టీజర్ విడుదల చేయాలని కమల్ భావిస్తున్నాడట. అందుకే అంతా సిద్ధమైనప్పటికీ విశ్వరూపం-2టీజర్ బయటకు రాలేదు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సర్వ హక్కులు కమల్ హాసన్ వే. కాబట్టి ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోవచ్చు. నచ్చినప్పుడు రిలీజ్ చేయొచ్చు. అందుకే కావాలనే ఎన్నికల కోసం విశ్వరూపం-2సినిమాను అట్టిపెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి సినిమా ప్రచారం షురూ చేసి, సమ్మర్ లో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని కమల్ భావిస్తున్నారట.