అనిల్ రావిపూడితో మాంచి ఫలితమే సాధించారు నిర్మాత దిల్ రాజు. అందుకే మరో సినిమాకు లాక్ చేసి వుంచుకున్నారు. మాంచి మల్టీస్టారర్ సబ్జెక్ట్ కూడా కుదిరింది. ఓ టాప్ హీరోగా వెంకీని దాదాపు ఫిక్స్ చేసుకున్నారు. అంతవరకు బండి బాగానే నడిచింది. కానీ ఆ తరువాత ఏంటీ?
ఎందుకంటే, వెంకీతో పాటు ఈ కథకు ఓ యంగ్ హీరో కూడా కావాలి? అది ఎవరు? అక్కడ లాక్ పడింది. దిల్ రాజు అడిగితే ఎవ్వరూ కాదనకపోవచ్చు. కానీ ఎవ్వరూ ఖాళీగా లేరు. శర్వా, నాని, ఇలా దాదాపు అందరూ. సాయి ధరమ్ తేజ పేరు కూడా డిస్కషన్ కు వచ్చిందని వినికిడి. పైగా కథకు సరిపోవాలి, వెంకీ ఓకె అనాలి. అలాగే వాళ్లు కూడా మొహమాటంగా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకూడదు.
వెంకీతో మల్టీ స్టారర్ అంటే కాస్త కష్టమే. గతంలో మహేష్, పవన్, రామ్ చేసారు. కానీ ముగ్గురికీ అసంతృప్తులే మిగిలాయని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. పైగా ఇక యంగ్ హీరో అంటే, వెంకీ ముందు కనపడనిస్తారా? అన్నది అనుమానం. అందువల్ల అనిల్ రావిపూడి ఎవర్ని సెట్ చేసుకుంటారన్నది కాస్త కష్టమైన పనే.
ఇన్ని ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు అప్పుడే పట్టాలు ఎక్కడం సాధ్యం కాకపోవచ్చు.