హీరో సునీల్ తో తమిళ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసారని తెలుస్తోంది. కృష్ణ ప్రసాద్ ఇప్పుడు మరో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు. ఇంద్రగంటి డైరక్షన్ లో, సుధీర్ బాబు హీరోగా నటించే సినిమా. అయితే ఈ సినిమా కోసం సునీల్ సినిమా క్యాన్సిల్ కాలేదని తెలుస్తోంది. దానికి వేరే రీజన్స్ వున్నాయని వినికిడి.
సునీల్ కాస్త లావు అయ్యారని, బాగా తగ్గితే తప్ప, ఈ సినిమా క్యారెక్టర్ కు సూట్ కారన్నది నిర్మాత రీజన్ గా చెబతున్నట్లు తెలుస్తోంది. కానీ లావు అన్నది సమస్య కాదని, గట్టిగా రెండు వారాలు వర్కవుట్ చేస్తే సరిపోతుందని, వేరే కారణాలు వున్నాయి అని తెలుస్తోంది. సినిమాకు సంభాషణల రచయిత దగ్గర హీరోకు, నిర్మాత ఓ మాట మీదకు రాలేకపోయారని తెలుస్తోంది.
హీరో ఈ సినిమాకు సంభాషణలు కమెడియన్, రచయిత కృష్ణ భగవాన్ అయితే బాగుంటారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ నిర్మాత వేరే వాళ్ల చేత స్క్రిప్ట్ రాయించారని టాక్. దానికి తోడు తమిళ సినిమా జిరాక్స్ కాపీ తీయాలని నిర్మాత, కాస్త మార్చాలని సునీల్ అనుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా అభిప్రాయాలు కుదరక ప్రాజెక్టును పక్కన పెట్టేసారని తెలుస్తోంది.