సినిమాల శాటిలైట్ అన్నది ఓ మాయాజాలం. ఒక విధంగా అదో సర్కిల్. తెలివైన వాళ్లు, సర్కిల్ వున్నవాళ్లు సులువుగా శాటిలైట్ చేయించేసుకుంటారు. లేని వాళ్లు అలా వుండాల్సిందే. కొండకచో రికమెండేషన్లు కూడా నడుస్తుంటాయి. పెద్ద సినిమాలకు ఈ సమస్యలేవీ వుండవు. అది వేరే సంగతి.
నెక్ట్స్ నువ్వే సినిమాకు ఎప్పుడో శాటిలైట్ అయిపోయింది. రెండున్నర కోట్ల దగ్గర. కానీ రాజశేఖర్ గరుడవేగకు కాలేదు. అదీ ఓ విధంగా అదృష్టమే. ఇప్పుడు మంచి రేటు పలికే అవకాశం వుంది. అయితే జీ, జెమినీ రెండూ కూడా నాలుగు కోట్ల దగ్గరే ఆగిపోయాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి, ఇంతకు ముందు చాలా సినిమాలకు జరిగిన శాటిలైట్ బిజినెస్ లను బట్టి చూస్తే అయిదారు కోట్ల వరకు పలకాలి.
అదే విధంగా హిందీ డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్ రెండున్నరకు అడుగుతున్నారట. ఈ మధ్యనే ఏంజెల్ సినిమానే 1.40కు తీసుకున్నారు. మరి రాజశేఖర్ సినిమాకు మరో కోటి మాత్రమే అదనమా? పైగా ఇది బాలీవుడ్ కు కూడా పనికి వచ్చే సబ్జెక్ట్ నే.
గరుడవేగ సినిమాకు సమస్య ఏమిటంటే, జీవిత తప్ప అక్కడ మరో సరైన పర్సన్ లేకపోవడమే. అన్నీ ఆవిడే చూసుకోవాలి. ఆవిడే మాట్లాడుకోవాలి. పైగా చిరకాలంగా బిజినెస్ డీల్స్ కు దూరంగా వున్నారు. దాంతో రేట్లు ఇక్కడ ఆగిపోయాయి. మరి ఆవిడ మరికాస్త గట్టిగా ప్రయత్నిస్తే, మరి కొంచెం ఎక్కువ రావచ్చు. శాటిలైట్ ఒక అయిదు, హిందీ డిజిటల్ ఓ మూడు వస్తే, సినిమాకు జీవిత పెట్టిన 8కోట్ల పెట్టుబడి వెనక్కు వచ్చేస్తుంది.
నిర్మాత పెట్టిన నాలుగు కోట్లు, వడ్డీలు, అదనపు ఖర్చులు రెండు మూడు కోట్లు థియేటర్ల మీద రాబట్టాల్సి వుంటుంది.