నక్కినా? మరో సబ్జెక్ట్ లేదా?

నక్కిన త్రినాధరావు మాంచి మాస్ ఎంటర్ టైనర్ ఇవ్వగల డైరక్టర్. కానీ ఇప్పటికి తీసిన రెండు సినిమాలు ఒకటే సబ్జెక్ట్. మామ అల్లుళ్లు సవాల్ టైపు. అందులోంచి పుట్టే ఫన్. ఇప్పుడు ముచ్చటగా మూడో…

నక్కిన త్రినాధరావు మాంచి మాస్ ఎంటర్ టైనర్ ఇవ్వగల డైరక్టర్. కానీ ఇప్పటికి తీసిన రెండు సినిమాలు ఒకటే సబ్జెక్ట్. మామ అల్లుళ్లు సవాల్ టైపు. అందులోంచి పుట్టే ఫన్. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతున్నారు. అది కూడా నేను లోకల్ వంటి సినిమా అందించిన దిల్ రాజు బ్యానర్ లోనే. హీరోగా రామ్ ను తీసుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రామ్ కు ఇది మొదటి సినిమా. ఈ విశేషాలన్నీ ఇంతకు ముందే వెల్లడించేసాం.

లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో కూడా మామా, అల్లుళ్ల పాత్రలే కీలకం అంట. అయితే ఈసారి చిన్న మార్పు చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూపిస్తా మామా, నేనులోకల్ సినిమాల్లో మామా అల్లుళ్లు ఎదురు ఎదురుగా వుండి, సినిమాను నడిపిస్తారు. కానీ రామ్ తో చేయబోయే సినిమాలో మాత్రం మామ.. అల్లుళ్లు ఒక పక్కనే వుండి కథను నడిపిస్తారట. అంటే వీళ్లను ఢీకొనే క్యారెక్టర్ మరొకటి వుంటుందన్నమాట. 

బాగానే వుంది. ఇంతకీ రామ్ తో పాటు వుండే మామ, వాళ్లు ఢీకొనే ప్రతినాయకుడి క్యారెక్టర్లకు ఎవర్ని తీసుకుంటారో ఇంకా తెలియాల్సి వుంది.