వెంకీతో కాజల్

కొన్ని కొన్ని కాంబినేషన్ల ఆసక్తికరంగా వుంటాయి. అలాంటి వాటిల్లో విక్టరీ వెంకటేష్-కాజల్ కాంబినేషన్ ఒకటి. గతంలో ఒకటి రెండు సార్లు ఈ కాంబినేషన్ వినిపించింది కానీ వర్కవుట్ కాలేదు. కానీ ఈ సారి పక్కా…

కొన్ని కొన్ని కాంబినేషన్ల ఆసక్తికరంగా వుంటాయి. అలాంటి వాటిల్లో విక్టరీ వెంకటేష్-కాజల్ కాంబినేషన్ ఒకటి. గతంలో ఒకటి రెండు సార్లు ఈ కాంబినేషన్ వినిపించింది కానీ వర్కవుట్ కాలేదు. కానీ ఈ సారి పక్కా అని తెలుస్తోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన డైరక్టర్ తేజ, తన తరువాతి వెంచర్ గా విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ నెల 15తరువాత నుంచి ఈ సినిమా షూటింగ్ పార్ట్ ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం తేజ గత నెల రోజులుగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పని మీదే బిజీగా వున్నారు. ఈ ప్రాజెక్టులోకి వెంకటేష్ పక్కన కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని తేజ, వెంకీ, నిర్మాత సురేష్ బాబు యునానిమస్ గా డిసైడ్ అయ్యారు. ఆ మేరకు కాజల్ ను అప్రోచ్ అయ్యారు కూడా. అయితే ఇంకా పూర్తిగా ఫిక్స్ అయిందా లేదా అన్నది బయటకు చెప్పడం లేదు.

అదే నిర్మాత, అదే డైరక్టర్ తో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసింది కాజల్. అప్పుడు అబ్బాయి హీరో. ఇప్పుడు బాబాయ్ హీరో. అంతే తేడా. ఈ సినిమా ఒకె అయితే చాలా విశేషాలు వుంటాయి. వెంకీతో తోలిసారి నటించడం మాత్రమే కాదు. రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా చేసి చిరు పక్కన హీరోయిన్ అయ్యింది. ఇప్పుడేమో, రానా పక్కన హీరోయిన్ గా చేసి, వెంకీ పక్కకు వచ్చింది. ఈ రేర్ ఫీట్ అందరు హీరోయిన్లకు దొరకదు కదా.