హీరోకు ఓ రేంజ్ వచ్చేవరకు మీడియా కన్ను అతగాడిపై పడదు. లేదా కనీసం బ్యానర్ బ్యాకింగ్ అయినా వుండాలి. బ్యానర్ బ్యాకింగ్ వుంటే చిన్న, కొత్త హీరో అయినా మీడియా కన్ను పడుతుంది. ఏంజెల్ సినిమాకు పాపం, బ్యానర్ బ్యాకింగూ లేదు, హీరో రేంజ్ కూడా లేదు. అందుకే ఆ సినిమాను మీడియా పట్టించుకోలేదు.
నెక్ట్స్ నువ్వే సినిమా గీతా లాంటి పెద్ద సంస్థ బ్యాకింగ్ తో వచ్చింది. అందువల్ల ఆ సినిమా బడ్జెట్ తక్కువైనా పట్టించుకున్నారు. దాంతో పోల్చుకుంటే ఎక్కువ బడ్జెట్ సినిమా అయినా ఏంజెల్ ఎవరికీ ఆనలేదు. దాంతో ఏంజెల్ సినిమాకు సమీక్షలు కూడా రాలేదు.
చిత్రమేమిటంటే, వసూళ్లు చూసుకంటే నెక్ట్స్ నువ్వే సినిమాకు, ఏంజెల్ కు రెండింటికీ సాదాసీదా వసూళ్లే కానీ, కంపారిటివ్ గా అన్నిచోట్లా, ఏంజెల్ నే ముందు వుంది. ఆఖరికి హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో కూడా. సినిమా పబ్లిసిటీ బాగుండడం, హెబ్బా వుండడంతో ఆ మాత్రం కలెక్షన్లు వస్తున్నాయి.
బాగుందనో, బాగాలేదనో, తను తొలి సినిమాకు, మలి సినిమాకు ఇంప్రూవ్ అయ్యాననో, లేదనో, ఏదో ఒకటి సహేతుక విమర్శ చేసి వుంటే, నటుడిగా తనకు ఆనందంగా వుండేదని, కానీ మీడియా తన సినిమాను కనీసం పట్టించుకోలేదని హీరో నాగ్ అన్వేష్ ఫీలవుతున్నాడట.