నిన్న రిలీజ్.. ఇవ్వాళ నెట్ ప్రింట్

సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇలా విడుదలయితే, అలా నెట్ లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ లు ప్రతి చేతిలోనూ వుంటున్నాయి. మల్టీ ఫ్లెక్స్ ల్లో సైతం స్మార్ట్ ఫోన్ ల…

సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇలా విడుదలయితే, అలా నెట్ లో ప్రత్యక్షం అయిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ లు ప్రతి చేతిలోనూ వుంటున్నాయి. మల్టీ ఫ్లెక్స్ ల్లో సైతం స్మార్ట్ ఫోన్ ల చిత్రీకరణపై ఎటువంటి నిఘా వుండడంలేదు. ఇక చిన్న ఊళ్లలోని సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఏముంది? ఇలాతీసి అలా ఫేస్ బుక్ లో, ఇంటర్ నెట్ ల్లో, టొరెంటో సైట్లలో అప్ లోడ్ చేసేస్తున్నారు.

నిన్న విడుదలైన చిన్న సినిమా 'నెక్ట్స్ నువ్వే' శనివారం ఉదయానికే నెట్ లో ప్రత్యక్షమైపోయింది. థియేటర్ ప్రింట్ అని తెలిసిపోతోంది. కానీ క్లారిటీ చూడబుల్ గానే వుంది. ఇలాంటపుడు ఇక సినిమా కలెక్షన్ల పరిస్థితి ఎలా వుంటుంది? అసలు సినిమాలకు వుండే కలెక్షన్లే విడుదలయిన మూడురోజుల పాటు. అలాంటిది మర్నాడే నెట్ లోకి ప్రింట్ వచ్చేస్తే, ఆ మూడురోజుల్లో మళ్లీ రెండురోజులు ఎగిరిపోయే ప్రమాదం వుంది. 

ప్రభుత్వాలు ఎంత హెచ్చరికలు చేసినా, సినిమా జనాలు ఎన్ని టీమ్ లను ఎంగేజ్ చేసినా, ఈ నెట్ ప్రింట్ ల తలకాయ నొప్పి మాత్రం వదలడంలేదు. సినిమా థియేటర్ల టికెట్ రేట్లు, క్యాంటీన్ల రేట్లు ఆకాశంలోకి వెళ్తున్న కొద్దీ ఈ సమస్య మరింత జటిలం అవుతుందేమో?