ప్రభాస్ అంత ఛీప్ అయిపోయాడా!

20కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడనే నెపంతో ప్రభాస్ తో చేయాల్సిన సినిమాను కరణ్ జోహార్ వదులుకున్నాడంటూ ఈమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ వార్త.. బాలీవుడ్ లో ఇప్పుడు కీలకమైన…

20కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడనే నెపంతో ప్రభాస్ తో చేయాల్సిన సినిమాను కరణ్ జోహార్ వదులుకున్నాడంటూ ఈమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ వార్త.. బాలీవుడ్ లో ఇప్పుడు కీలకమైన మలుపు తీసుకుంది. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ప్రభాస్ కు భారీ మద్దతు దక్కుతోంది.

బాలీవుడ్ లో ఓ మోస్తరు నటులు తీసుకుంటున్న పారితోషికాలతో, ప్రభాస్ చెప్పిన రెమ్యునరేషన్ ను కంపేర్ చేస్తూ బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి. జుడ్వా-2తో ఓ సక్సెస్ అందుకున్న వరుణ్ ధావన్ తన రెమ్యూనరేషన్ ను అమాంతం 25కోట్ల రూపాయలకు పెంచేశాడు. 

బాహుబలి-2తో రికార్డులు సృష్టించి, దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ మాత్రం 20కోట్లు అడిగితే తప్పేంటంటూ స్టోరీలు వస్తున్నాయి. బిలో యావరేజ్ మార్కెట్ కలిగిన అజయ్ దేవగన్, ప్రతి సినిమాకు 23-25కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అతడిని పెట్టి ఓ హిందీ సినిమా చేసే కంటే, ప్రభాస్ ను హీరోగా పెట్టి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ సినిమా చేయడం చాలా బెస్ట్ అంటూ మరో కథనం కూడా వచ్చింది.

ఇవన్నీ పక్కనపెడితే.. ప్రభాస్ అడిగింది కూడా ఏమంత ఎక్కువకాదంటూ మరో వార్త కూడా ప్రత్యక్షమైంది. ప్రస్తుతం అతడు చేస్తున్న సాహో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో అంతే మొత్తాన్ని హిందీ ప్రాజెక్టు కోసం అడిగాడే తప్ప, రేటు పెంచలేదనేది ఆ వార్త సారాంశం.

ఇవన్నీ నిజాలే. బాలీవుడ్ ప్రాజెక్టు కోసం ప్రభాస్ రేటు పెంచలేదు. ఇంకా చెప్పాలంటే బాహుబలి-2 సాధించిన ఘనతతో పోలిస్తే ప్రభాస్ చెప్పిన ఎమౌంట్ చాలా తక్కువ. కానీ కరణ్ జోహార్ లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి. ప్రభాస్ కు 20కోట్లు ఇచ్చే బదులు, అంతే మొత్తానికి అటుఇటుగా రణబీర్ కపూర్ (25కోట్లు), రణ్వీర్ సింగ్ (20కోట్లు), షాహిద్ కపూర్ (18కోట్లు) లాంటి హీరోలతో సినిమా చేయొచ్చు.

కానీ పైన చెప్పుకున్న హీరోల కంటే ప్రభాస్ తో సినిమా చేస్తేనే కరణ్ జోహార్ కు ఎక్కువ లాభం. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా తన సినిమాను మార్కెట్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా బాహుబలి క్రేజ్ ను క్యాష్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. ఇవేవీ కరణ్ జోహార్ కు తెలియనివి కావు.

కానీ ప్రభాస్ రేటు ఎక్కువ చెప్పాడంటూ కరణ్ తప్పుకోవడం ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకు కోపం తెప్పిస్తోంది. అందుకే ప్రభాస్ కు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. ఇదే ఊపులో మరో బాలీవుడ్ దర్శకుడు ప్రభాస్ తో సినిమా ప్రకటిస్తే ఎంత బాగుంటుందో కదా.