ఈ 2017లో నాని ఫుల్ జోష్ మీద వున్నాడు. ఇప్పటికే రెండు హిట్ లు కొట్టాడు. నేను లోకల్, నిన్నుకోరి అంటూ రెండు సినిమాలు అందించిన నాని, ముచ్చటగా మూడో సినిమాను డిసెంబర్ 21న అందించే ప్రయత్నంలో వున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఎంసిఎ ఆరోజు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కానీ నాగ్ నిర్మిస్తున్న అభిల్ సినిమా హలో కూడా వుండనే వుంది.
ఈ సినిమా వ్యవహారం ఇలా వుండగానే నాని తన తరువాత సినిమాకు కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసుకున్నాడు. మార్చి 27న తను-డైరక్టర్ మేర్లపాక గాంధీతో చేస్తున్న సినిమా విడుదలకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంటే మళ్లీ 2017మాదిరిగానే 2018లో కూడా మూడు సినిమాలు విడుదల చేయాలని నాని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఎలాగూ కిషర్ తిరుమల, విక్రమ్ కుమార్ ల సినిమాలు లైన్లో వున్నాయి. బాబీతో కూడా సినిమా చేసే అవకాశం వుంది. అందువల్ల టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. ఇక నాగ్ చేయబోయే మల్టీ స్టారర్ వుంది. పైగా మరి కొంతమంది నాని కోసం స్క్రిప్ట్ లు రెడీ చేస్తున్నారు.
మొత్తంమీద నాని పని బాగుంది. సినిమాకు అయిదు నుంచి ఆరుకోట్లు తీసుకుంటున్నట్లు వినికిడి. వెల్ ప్లాన్డ్ గా ఏడాదికి మూడు సినిమాలు అంటే 18కోట్లు. అంటే పెద్ద హీరోలు ఏడాదికి సంపాదించినట్లే నాని కూడా ఆర్జిస్తున్నాడన్నమాట.