అసలే ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో తనకు వచ్చిన రిమార్కులతో కిందామీదా అవుతోంది లావణ్య త్రిపాఠీ. ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గెటప్, నటన, ఇలా అన్నింటి ముందు, లావణ్య త్రిపాఠీ తీసికట్టు అయిపోయింది. అసలు ఆమె వల్లనే సినిమా సెకండాఫ్ తన్నేసిందన్న కామెంట్లు కూడా వున్నాయి. తెలుగులో ఇక కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిపోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి టైమ్ లో కోలీవుడ్ లో మరో షాక్ తప్పలేదు. తెలుగులో నాగ చైతన్య-తమన్నా చేసిన 100% లవ్ సినిమాను తమిళంలో తీస్తున్నారు. మ్యూజిక్ డైరక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరో. ముందు ఈ సినిమాలో లావణ్యనే తీసుకున్నారు. కానీ ఆమె ఎందుకో మధ్యలో తప్పుకుంది. తరువాత అర్జున్ రెడ్డి హీరోయిన్ ను తీసుకున్నారు.
అంతవరకు బాగానే వుంది. కానీ ఇప్పుడు తమిళ సినిమా నిర్మాతలు, లావణ్య సడెన్ గా తప్పుకోవడం వల్ల తమకు చాలా నష్టం వచ్చిందని, పరిహారంగా మూడుకోట్లు కావాలని అక్కడి కౌన్సిల్ ను ఆశ్రయించారు. కౌన్సిల్ నిర్ణయం నిర్మాతలకు అనుకూలంగా వుండేలా వుందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే, ఇప్పుడు లావణ్య బ్యాంక్ అక్కౌంట్ ఖాళీ అయిపోతుంది. కనీసం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలన్నా, రెండు మూడు సినిమాల డబ్బులు ఎగిరిపోతాయి.