రజనీ రోబో 2.0విడుదల వాయిదా పడుతుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ అవకాశాన్ని ఎవరు క్యాష్ చేసుకుంటారో అన్నది ఆసక్తిగా వుంది. జనవరి 10న పవన్-త్రివిక్రమ్ అజ్ఞాతవాసి వస్తోంది. సంక్రాంతికి బాలయ్య జై సింహా విడుదలవుతుంది. పవన్ సినిమా కారణంగా రామ్ చరణ్-సుకుమార్ రంగస్థలం 1985 వెనక్కు వెళ్లింది. అయితే ఎక్కడయినా అవకాశం దొరుకుతుందనే ఆశతో సంక్రాంతి టార్గెట్ గానే సినిమాను రెడీ చేయాలని నిర్మాతలు మైత్రీ మూవీస్ సంకల్పం.
ఇప్పుడు ఆ అవకాశం రోబో 2.0 వాయిదా రూపంలో వస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ సినిమా 10న విడుదల అంటే జనవరి 25నాటికి 15రోజులు దాటేస్తుంది. అందువల్ల పవన్ సినిమాకు కానీ, పవన్ సినిమాతో కానీ వచ్చిన సమస్య ఏమీలేదు. పైగా జనవరి 26రిపబ్లిక్ డే. అందువల్ల రామచరణ్ ఈ అవకాశాన్ని వాడుకుంటాడా? అన్నది చూడాలి.
ఎందుకంటే ఇంకా సినిమాకు చాలా పనులు వున్నాయని తెలుస్తోంది. ఇవన్నీ రెండునెలల్లో పూర్తికావాలి. ఒకవేళ ఈ టార్గెట్ ను చరణ్ అందుకోకపోతే, జనవరి థర్డ్ వీక్ పై ఎవరు రుమాలు వేస్తారో చూడాలి.