చల్ది కన్నా ఊరగాయ ఘనం అంటే ఇదే. హీరో ఏమో నాగ చైతన్య. స్పెషల్ క్యారెక్టర్ మాధవన్. కానీ మాధవన్ కు నాలుగు కోట్ల రెమ్యూనిరేషన్ అంట. నాగ్ చైతన్యకూ మరి మాధవన్ తో సమానంగా నాలుగు కోట్లు ఇస్తున్నారా? అనుమానమే. ఇదంతా చందు మొండేటి-మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో సవ్యసాచి సంగతే.
ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం తమిళ్ హీరో మాధవన్ ను తీసుకుంటున్నారట. ఈ సబ్జెక్ట్ ను ఉభయభాషల్లో తీయాలన్న ప్రయత్నం. మాధవన్ వుంటే తమిళ్ లో కూడా మార్కెట్, శాటిలైట్ చేసుకోవచ్చని ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల మాధవన్ కు నాలుగు కోట్లు ఇవ్వడానికి సిద్దపడినట్లు కనిపిస్తోంది.
ఇంతవరకు బాగానే వుంది. మాధవన్ ను తీసుకున్నాం, నాలుగు కోట్లు ఇచ్చాం, తమిళ నాట చూడాలంటే ఆ పాత్రకు ప్రాధాన్యత వుండాలి. తమిళ్ వెర్షన్ కోసం ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటే, మాత్రం తెలుగు వెర్షన్ కు తేడా వచ్చేస్తుంది.
తెలుగునాట జనాలకు మాధవన్ తెలుసు. మంచి నటుడే కానీ, మరీ క్రేజ్ వున్నవాడు కాదు. మరి సవ్యసాచి అని టైటిల్ పెట్టినందుకు తెలుగు,తమిళ్ అనే రెండు పడవల మీద సక్సెస్ ఫుల్ ప్రయాణం చేయాలనుకుంటున్నారేమో?