ఎన్టీఆర్‌ రిజెక్ట్‌ చేయడం మంచిదే

'రాజా ది గ్రేట్‌' చిత్రంలో నటించడానికి మొదట ఉత్సాహపడిన రామ్‌ ఆ తర్వాత ఆ కథ షేప్‌ తీసుకున్న విధానం నచ్చక డ్రాప్‌ అయ్యాడు. దాంతో ఆ కథ ఎన్టీఆర్‌కి చెప్పాడు అనిల్‌ రావిపూడి.…

'రాజా ది గ్రేట్‌' చిత్రంలో నటించడానికి మొదట ఉత్సాహపడిన రామ్‌ ఆ తర్వాత ఆ కథ షేప్‌ తీసుకున్న విధానం నచ్చక డ్రాప్‌ అయ్యాడు. దాంతో ఆ కథ ఎన్టీఆర్‌కి చెప్పాడు అనిల్‌ రావిపూడి. బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేయడానికి ఆసక్తి చూపించిన ఎన్టీఆర్‌ కూడా దీనికంటే 'జై లవకుశ' బెటర్‌ అని అటు షిఫ్ట్‌ అయ్యాడు.

అలా 'రాజా ది గ్రేట్‌' రవితేజ చేతుల్లోకి వెళ్లింది. మంచి ఓపెనింగ్‌ తెచ్చుకున్న ఈ చిత్రంలో హీరో బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేసినా కానీ ఎలాంటి ప్రత్యేకతలు లేవు. నటుడిగా రవితేజకి ఈ చిత్రం తెచ్చే కొత్త ఇమేజ్‌ ఏమీ లేదు. ఎప్పుడూ నటించినట్టే ఈ పాత్రని కూడా చేసేసిన రవితేజ తన ట్రేడ్‌ మార్క్‌ కామెడీ టైమింగ్‌తో దీనిని నడిపించాడు.

జై లవకుశ యావరేజ్‌గా ఆడినా కానీ జై పాత్రతో ఎన్టీఆర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. నటుడిగా అతనిలో కొత్త కోణాన్ని చూపించింది. కేవలం బ్లైండ్‌ పాత్రని తీర్చిదిద్ది రెగ్యులర్‌ మసాలా సినిమా తీసిన అనిల్‌ రావిపూడి చిత్రం చేయడం వల్ల ఎన్టీఆర్‌కి పెద్దగా ఒరిగేదేమీ వుండేది కాదు. పైగా తన రేంజ్‌కి బిజినెస్‌ జరిగివుంటే అంచనాలన్నీ తలకిందులయ్యేవి. ఎలా చూసినా రాజా ది గ్రేట్‌ కంటే జై లవకుశ ఎన్టీఆర్‌కి మంచి ఆప్షనే అని చెప్పాలి.