స్పైడర్ చిత్రం అంతటి ఘోర పరాజయం పాలవడానికి కారకుడు మురుగదాస్ అనడంలో సందేహం లేదు. మహేష్‌బాబు ఇమేజ్‌ని లెక్క చేయకుండా, అతనిపై ప్రయోగానికి పాల్పడి, హీరో కంటే విలన్‌కి ప్రాధాన్యత వున్న కథతో అభిమానుల్ని, మాస్ ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశ పరిచాడు.
తమిళనాడులో పెద్ద స్టార్ కావడం వల్ల మురుగదాస్ వల్ల తమిళ వెర్షన్ బాగా సేల్ అవుతుందని నిర్మాతలు నమ్మారు. మంచి రేట్ అయితే పలికింది కానీ మురుగదాస్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద పని చేయలేదు. స్పైడర్ తెలుగులోలానే తమిళంలో కూడా డిజాస్టర్ అయింది. ఈ చిత్రానికి మురుగదాస్‌కి రెండు వెర్షన్లకి కలిపి ఇరవై కోట్ల పారితోషికం ఇచ్చారట.
స్పైడర్ ఫ్లాప్ అవడంతో తన పారితోషికం నుంచి అయిదు కోట్లు నిర్మాతలకి వెనక్కి ఇస్తానని మహేష్ మాట ఇచ్చాడు. అలాగే ఈ పరాజయానికి బాధ్యత వహిస్తూ మురుగదాస్ కూడా తన పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వాలనే ఒత్తిడి పెరిగిందట. ఇంతకుముందు ఈ రేంజ్ డిజాస్టర్లు తీసిన ట్రాక్ రికార్డ్ లేకపోవడంతో ఒక్క పరాజయానికే ఈ స్థాయి ఒత్తిడిని మురుగదాస్ ఎలా తీసుకుంటాడో?