కళ్యాణ కృష్ణ కోరిక తీరేనా?

సోగ్గాడే చిన్ని నాయనా తో నాగ్ కు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. రారండోయ్ వేడుక చూద్దాంతో నాగ చైతన్యకు మరో హిట్ ఇచ్చాడు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. కానీ ఇంకా తరువాత సినిమా…

సోగ్గాడే చిన్ని నాయనా తో నాగ్ కు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. రారండోయ్ వేడుక చూద్దాంతో నాగ చైతన్యకు మరో హిట్ ఇచ్చాడు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. కానీ ఇంకా తరువాత సినిమా సెట్ మీదకు రాలేదు. నిజానికి కళ్యాణ్ కృష్ణ దగ్గర మంచి స్క్రిప్ట్ లే వున్నాయి. కానీ హీరోలే అందుబాటులోకి రావడంలేదు. నాగ చైతన్య, వెంకటేష్ ల కాంబినేషన్ కు ఓ మాంచి స్క్రిప్ట్ సెట్ చేసుకుని కూర్చున్నాడు. వాళ్లు కూడా సుముఖంగానే వున్నారు.

కానీ కాంబినేషన్ డేట్ లు సెట్ కావడంలేదు. చైతన్య చేతిలో రెండు ఒకే చెప్పినవి వున్నాయి. వెంకీ దీపావళికి ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు తేజ డైరక్షన్ లో. ఇదిలా వుంటే హీరో రవితేజకు కూడా కళ్యాణ్ కృష్ణ ఓ లైన్ చెప్పినట్లు వినికిడి. రవితేజ కూడా కాస్త సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. 

అయితే చైతన్య-వెంకీల సినిమా సంగతి తేలితే, వేరే ప్రాజెక్టు మీదకు వెళ్లే అవకాశం వుంది. అది తేలే వరకు ఆయన వేచి చూస్తున్నట్లుంది. కానీ అది తేలాలంటే అంత వీజీకాదు. అక్కడ సురేష్ బాబు వున్నారు. ఇక్కడ నాగార్జున వున్నారు. వీళ్ల మనసులు గెలుచుకుని, చైతూ-వెంకీల డేట్లు పట్టాలి. మరి కళ్యాణ్ కోరిక ఎప్పుడు తీరుతుందో?