శ్రీనువైట్ల సినిమాకు మైత్రీ నో?

దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి దొరకడం లేదు అన్నట్లు వుంది దర్శకుడు శ్రీనువైట్ల పరిస్థితి. రవితేజ ఓకె అన్నాడు శ్రీనువైట్ల చెప్పిన లైన్ కు. స్క్రిప్ట్ చేసుకోమన్నాడు. అంతవరకు బాగానే వుంది. కానీ…

దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి దొరకడం లేదు అన్నట్లు వుంది దర్శకుడు శ్రీనువైట్ల పరిస్థితి. రవితేజ ఓకె అన్నాడు శ్రీనువైట్ల చెప్పిన లైన్ కు. స్క్రిప్ట్ చేసుకోమన్నాడు. అంతవరకు బాగానే వుంది. కానీ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన మైత్రీ మూవీస్ వెనక్కు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే, శ్రీనువైట్లనే కారణం అని వినికిడి. రవితేజతో సినిమా తీసి ఫస్ట్ కాపీ చేతిలో పెడతా, అన్నీ కలిపి 25కోట్లకు తనకు ప్రాజెక్టు ఇవ్వమని శ్రీనువైట్ల అడిగినట్లు వినికిడి. దీంతో మైత్రీ వాళ్లు ఆలోచనలో పడ్డారు. మిస్టర్ నిర్మాత అనుభవం వీళ్లకు గుర్తుకు వస్తోంది. పాతిక కోట్లు అని చెప్పి, దాటించేస్తారో? లేదా మరి కొంత మంది డైరక్టర్ల మాదిరిగా 20లో చుట్టేస్తారో అన్న భయం. అదీ కాక, ప్రొడక్షన్ కే 25 అంటే, ఇంకా పబ్లిసిటీ, ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి ముఫైకి డేకేస్తుంది.

బెంగాల్ టైగర్ ఇలాగే ముఫై దాటింది. నిర్మాత నానా బాధలు పడ్డారు. అందుకే మైత్రీ మూవీస్ వెనక ముందు ఆడుతోంది. వాళ్లు ఏ సంగతీ క్లియర్ గా చెప్పేస్తే, శ్రీను వైట్ల మరో నిర్మాతను వెదుక్కుంటారు.