రాజ్ తరుణ్ కు ఓ హ్యాబీ వుంది. కుక్కలు అంటే ప్రాణం. అతని దగ్గర కాస్త పెద్ద సంఖ్యలోనే అనేక రకాల కుక్కలు వున్నాయి. కొన్ని కొన్నవి. కొన్ని వీధుల్లోంచి తెచ్చినవి. వీటి కోసం ఓ మనిషి. బోలెడు ఖర్చు. షూటింగ్ లేకపోతే, వాటితోనే రాజ్ తరుణ్ కాలక్షేపం. అంత పిచ్చి కుక్కలంటే. కిట్టూగాడు వున్నాడు జాగ్రత్తలో కనిపించే కుక్కపిల్లల్లో కొన్ని రాజ్ తరుణ్ ఇంటిలోనివే.
అయితే జస్ట్ టూ డేస్ బ్యాక్ రాజ్ తరుణ్ పెంపుడు పప్పీల్లో ఒక దానికి జబ్బు చేసింది. దాదాపు రెండు లక్షలు ఖర్చు చేసాడు. ఆపరేషన్ కూడా చేసారు. అయినా బతకలేదు. దాంతో రెండు మూడు రోజులుగా రాజ్ తరుణ్ మూడీ అయిపోయాడు. ఎవరు పలకరించినా ఇదే చెప్పుకుని బాధపడుతున్నాడట.
అయినా కుర్రాడు, మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలా? ఈ ఇండస్ట్రీలో బతకాలంటే, మరీ అంత సున్నితంగా వుండకూడదేమో?